అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్ల‌జాతీయుడైన‌ పోలీస్‌ అధికారి దాష్టికానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం నిరసనలు తెలిపింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన‌ ఈ సంఘటపై అమెరికా పెద్ద ఎత్తున ఆందోనళనలు జరిగాయి. తొలుత శాంతియుతంగానే ప్రారంభమైన ఆందోళనలు అనతికాలంలోనే హింసాత్మకంగా మారాయి. ‘జస్టిస్‌ ఫర్‌ ఎప్లాయిడ్‌’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అనేక చోట్ల పోలీసుల వాహనాలు, అధికారిక భవనాలపై రాళ్లు రువ్వారు. మరికొన్ని చోట్ల వాహనాలు, రెస్టారెంట్లకు నిప్పంటించారు.  మిన్నియాపోలిస్‌లో జార్జ్‌ ప్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని శ్వేతజాతీయుడైన పోలీస్‌ ఆఫీసర్‌ డెరెక చౌవిన్‌ అత్యంత అమానవీయంగా మెడపై వెూకాలిని నొక్కిపెట్టి చంపిన ఘటనలో కీలక మలుపు తిరిగింది.

 

ఆ శ్వేతజాతి పోలీసుపై థర్డ్‌ డిగ్రీ మర్డర్‌ కేసు నవెూదు చేశారు. ఈ సంఘటన మరువక ముందే మరో దారుణ సంఘటన జరిగింది. ఇటీవల న్యూయార్క్ నగరంలో తమను దుర్భాషలాడుతూ, వీడియో తీసిన ఓ నల్లజాతీయుడిని అరెస్టు చేస్తున్న సందర్భంగా కొందరు పోలీసులు అతని పట్ల కిరాతకంగా వ్యవహరించారు. ఒకరు అతని మెడపై తన మోకాలిని గట్టిగా ఉంచాడు. మరొకరు అతని కడుపుపై తన బలమంతా అదిమిపట్టి కూర్చున్నాడు. ఇంకొకడు అతని చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నాడు.

 

ఈ సంఘటనను అక్కడ ఉన్న కొందరు స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కాగా, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందన్నారు. అటు పోలీసుల చర్యతో బాధితుడు స్పృహ కోల్పోగా.. అతని సహచరులు హాస్పిటల్ కి తరలించారు. తమ క్లయింటుపై హత్యాయత్నానికి పాల్పడిన పోలీసు అధికారిని ప్రాసిక్యూట్ చేసేలా కోర్టుకెక్కుతామని ఆ నల్లజాతీయుని తరఫు లాయర్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: