రాజధాని విషయంలో ఏపీ సర్కార్ వెనక్కు తగ్గిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజధానికి సంబంధించిన రెండు బిల్లులను సర్కార్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు బిల్లులకు సంబంధించి మండలి లో చర్చ జరగకుండానే  మండలి నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు బిల్లుల విషయంలో ఏపీ సర్కార్ కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండటమే మంచిది అని భావిస్తుందని తెలుస్తోంది. 

 

అవును ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజధాని మీద ముందుకు వెళ్తే మాత్రం పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నట్టు అవుతుంది అని... కాబట్టి అమరావతి లో నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలి అని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రాజ‌ధానిని మార్చ‌కుండా ఉంటేనే మంచిది అనే భావన లో జగన్ ఉన్నార‌ట‌.

 

అందుకే మంత్రి బొత్స‌ సత్యనారాయణ కు ఇప్పుడు ఈ బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు అని పరిశీలకులు అంటున్నారు. వాస్త‌వానికి మూడు రాజ‌ధానుల అంశం ప్ర‌క‌ట‌న జ‌రిగిన‌ప్పుడు బొత్స ప‌దే ప‌దే అమ‌రావ‌తిలో ప్రెస్ మీట్లు పెడుతూ అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా వైజాగ్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చారు. త‌ర్వాత ఈ విష‌యంలో ఆయ‌న సైలెంట్ అయ్యారు. ఇక మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత బొత్స ఇదే అంశంపై మాట్లాడుతున్నారు.

 

ప్ర‌స్తుతం బొత్స రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి సీఎం సూచ‌న‌లే ప్రధాన కారణం అదే అని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు ఆయన అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను వరుసగా సమీక్షిస్తున్నారు. త్వరలోనే రైతులకు కౌలు కూడా చెల్లించే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: