ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కరోనా  వైరస్ భయమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారి వైరస్ కారణంగా... మనిషి ఏం చేసినా ఎటు వెళ్లినా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరి ద్వారా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుందో  అని భయం భయంగానే బతుకును వెళ్లదీస్తున్నారు సగటు మనిషి . ఎవరు కరోనా  వైరస్ బారిన పడ్డారో  ఎవ్వరు మామూలుగా ఉన్నారో తెలియని అయోమయ పరిస్థితి. ఇక ఎవరైనా దగ్గినా తుమ్మినా అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు జనాలు. కనీసం దరిదాపుల్లో కూడా ఉండడం లేదు. 

 


 అయితే తాజాగా తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే కరోనా  వైరస్ భయం మనుషుల్లో ఎంత దారుణంగా పాతుకుపోయింది  అన్నదానికి నిదర్శనంగా మారిపోయింది. ఇక్కడ జరిగిన ఘటన ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. కరోనా  వైరస్ సోకిన భార్యభర్తలు ఒక బస్సుల్లో ప్రయాణించడం తో ఆ బస్సులోనే మిగతా ప్రయాణికులు గుండెలు  జారిపోయాయి అని చెప్పాలి. ఏకంగా మృత్యువుని కళ్లారా చూసినంత  పని అయింది ఆ ప్రయాణికులు అందరికీ. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నేయేవెల్లి కి చెందిన ఆర్టీసీ బస్సు లో ఇద్దరు దంపతులు కడలూరు జిల్లా నుంచి బయలుదేరారు. 

 


 ఇక బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఆ ఇద్దరు భార్యాభర్తలకు వైద్య అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. వారికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు చరవాణి ద్వారా తెలిపారు. ఇంకేముంది వారితో పాటు ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణీకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక్కసారిగా వారి గుండెల్లో గుబులు మొదలైంది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల అందరూ తీవ్ర ఆందోళనకు గురై బస్సు దిగి పరుగులు పెట్టారు  ఇక కరోనా  వైరస్ సోకిన భార్యాభర్తలిద్దరిని  ఆంబులెన్స్ లో కరోనా వైరస్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత బస్సులో మొత్తం శానిటైస్  చేశారు. అయితే ఈ బస్సు లో ప్రయాణానికి ముందు రోజే వారు కరోనా  వైరస్ పరీక్ష కోసం నమూనాలు ఇచ్చినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: