మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంటర్ అయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎలాంటి దగ్గు గాని జ్వరం, జలుబు లాంటి వచ్చిన గాని జనాలలో భయాందోళన మొదలవుతుంది. దీంతో వైద్య రంగంలో కూడా వైద్యులు రోగికి వైద్య సేవలు అందించడానికి చాలా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని కరోనా కేంద్రాలుగా మారిపోయాయి. ప్రైవేట్ ఆస్పత్రిలు ఉన్న వైరస్ భయంతో చికిత్స అందించలేమని చేతులెత్తేస్తున్నాయి. దీంతో రోగాలు వచ్చే ఆసుపత్రికి వెళ్తున్నారు వైద్యం అందక తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. హైదరాబాదులో చికిత్స చేయించుకుందామని మొన్నటికిమొన్న వెళ్లిన ఓ వివాహిత ఈ విధంగానే ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది.

 

తాజాగా ఢిల్లీలో నీలా కుమారి గౌతమ్ అనే నిండు గర్భిణీ తన భర్త బిజేంద్ర సింగ్ తో కలిసి జూన్ 5వ తారీఖు ఉదయం 5 గంటల సమయంలో  నొప్పులు రావడంతో తన భర్తతో రిక్షా మాట్లాడుకుని హాస్పిటల్ కి వెళ్ళింది. వెళ్ళిన ఆసుపత్రి సిబ్బంది ఇక్కడ వైద్యం చేయరు వేరే ఆస్పత్రికి వెళ్లాలని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఊపిరి ఆడకపోవడంతో నీలా కుమారి గౌతమ్ మాస్కు తీస్తుండగా అక్కడ ఉన్న వైద్య సిబ్బంది మాస్కు తీసివేస్తే చెంప పగలగొడుతామంటూ వైద్యులు తీవ్రంగా స్పందించారు. దీంతో షాక్ కి భర్త గురయ్యాడు. అయినా తన భార్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని.. ఆక్సిజన్ పెట్టాలని ఎంతో బతిమాలాడు. వారు ససేమిరా అనడంతో ఇక విధిలేక అక్కడి నుంచి మరో ఆస్పత్రికి వెళ్లాడు. ఇలా 7, 8 ఆసుపత్రులు మారడం జరిగింది. చాలా చోట్ల వైరస్ భయంతో ఆసుపత్రి సిబ్బంది ఆ నిండు గర్భిణీ కి వైద్యం అందించడానికి భయపడ్డారు. ఈ విధంగా ఢిల్లీలో ఆసుపత్రి సిబ్బంది వ్యవహరిస్తున్న తరుణంలో భర్త బిజేంద్ర పోలీసుల సహాయం కోరడం జరిగింది.

 

వెంటనే పోలీసులు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులతో మాట్లాడి చికిత్సకి ఒప్పించారు. అయినా కానీ అక్కడ మరి కొన్ని ఆసుపత్రులకు ఆ నిండు గర్భిణిని ప్రభుత్వ వైద్యులు చెప్పటం తో దాదాపు ఎనిమిది గంటల పాటు ఇటు తిరగడంతో చివరాఖరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో భర్త కుప్పకూలిపోయాడు. ఈ విధంగా నిండు గర్భిణీ వైద్యుల నిర్లక్ష్యం ఆసుపత్రుల సిబ్బంది సరైన రీతిలో వ్యవహరించక పోవడం చేత మరణించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేక చోట్ల జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రులు వీటిపై దృష్టి పెట్టకపోతే మానవత్వం మంట కలిసిపోయి రాబోయే రోజుల్లో ఆసుపత్రులపై ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు నెలకొంటాయి. కాగా జరిగిన ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: