సముద్రతీరం విశాలంగా ఉంటుంది. సముద్రం లోతు కూడా అలాగే ఉంటుంది. సముద్రతీరం దగ్గర రహస్యాలు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఉంటాయి. ఈ సముద్రతీరాన్ని అడ్డం పెట్టుకుని కసబ్ అతని టీం ముంబైలోకి అడుగుపెట్టి అల్లకల్లోలం సృష్టించింది. సాగరతీరాల నుంచి ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సముద్ర తీర ప్రాంతాల గస్తీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. 
 
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కీలక పరిణామాలను గమనిస్తూ ఉంటే నిన్న తమిళనాడులోని బీచ్ రోడ్డుకు 200 కోట్ల రూపాయల డ్రగ్స్ కొట్టుకొచ్చాయి. డ్రగ్స్ కొట్టుకువచ్చిన డ్రమ్స్ పై చైనా భాషలో ఏదో రాసి ఉంది. ఆ డ్రమ్ ను ఓపెన్ చేస్తే అందులో టీపొడిలాంటి పదార్థం ఉందని గమనించి డ్రగ్ కంట్రోలర్ డిపార్టుమెంట్ అధికారులను పోలీసులు పిలిపించగా ఆ డ్రగ్ మెథాబయోటిన్ అని అధికారులు గుర్తించారు. 
 
డ్రగ్ డీలర్లు వీటిని చైనా నుండి ఓడలలో తెచ్చి ఎవరికీ కనిపించకుండా డ్రమ్ములకి తాళ్లు కట్టి నీళ్లలోంచి బయటకు తీసి తీసుకెళుతుండగా పడిపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహాబలిపురానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉండటంతో అక్కడ డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇలాంటి ప్రాంతాలే ప్రమాదకరమైనవి అని సైన్యాలు చొరబడటానికి, మాఫియా శక్తులు రావడానికైనా అవకాశాలు ఉన్న ప్రాంతాలు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు భయంగానే వాటిని ఓపెన్ చేశారు. అదే సమయంలో చైనా భాషలో డ్రమ్ పై రాసి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. చైనా భాషలో ఉన్న డ్రమ్స్ భారత్ కు చేరడంతో భారత్ కు చైనా డ్రగ్స్ సరఫరా చేస్తోందా...? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.         

మరింత సమాచారం తెలుసుకోండి: