కడప జిల్లా..వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ‌పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న దగ్గర నుంచి, కడప జిల్లాలో టీడీపీకి అంతగా ఆదరణ లేకుండా పోయింది.  2004,2009 ఎన్నికల్లో కడప జిల్లాలో కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇక వైఎస్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో పరిస్తితులు మారిపోయాయి. ఉపఎన్నికల్లో ఎలాగో జగన్, వైఎస్ విజయమ్మ దేశంలో ఎక్కడా లేని మెజారిటీతో గెలిచేశారు. ఇక 2014 ఎన్నికలకొచ్చేసరికి రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా కడపలో మాత్రం వైసీపీ హవా నడిచింది.

 

మొత్తం 10 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 9 గెలిస్తే, టీడీపీ కేవలం ఒకటే గెలిచింది. రెండు పార్లమెంట్ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ హవా పూర్తిగా సాగింది. 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీ దారుణ పరాజయం పాలైంది. అయితే భవిష్యత్‌లో కూడా కడపలో టీడీపీ ఒక సీటు గెలవడం కూడా కష్టమనే పరిస్తితి వచ్చేసింది. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా కడపలో మాత్రం వైసీపీదే పైచేయి.

 

అయితే సేమ్ కడపలో టీడీపీ పరిస్తితి ఎలా తయారైందో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా అలాగే ఉంది. చిత్తూరు జిల్లా ఎక్కువ శాతం వైసీపీ హ్యాండ్‌లోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లోనే చిత్తూరులో ఉన్నా 14 సీట్లలో వైసీపీ 8, టీడీపీ 6 గెలిచింది. అలాగే ఒక పార్లమెంట్ వైసీపీ, ఒక పార్లమెంట్ టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్నా 14లో వైసీపీ 13 గెలిస్తే, కేవలం కుప్పంలో చంద్రబాబు గెలిచారు. రెండు పార్లమెంట్ స్థానాలు వైసీపీ ఖాతాలోకే పోయాయి. అయితే భవిష్యత్‌లో కూడా కడప మాదిరిగానే చిత్తూరులో కూడా వైసీపీ హవా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏ ఎన్నికలైన ఇక్కడ మెజారిటీ సీట్లు వైసీపీవేనని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: