జగన్ పాలనకు ఏడాది పూర్తి అయిపోయింది. ఏడాదిలో తమ నాయకుడు జగన్ పాలన అద్భుతంగా ఉందని, ప్రజలందరూ తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలు జగన్ పాలన దారుణంగా ఉందని, ప్రజల వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకితగా ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమదే అధికారమని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

 

అయితే వీరి మాటల యుద్ధం ఇలా కొనసాగుతుండగానే సి‌పి‌ఎస్ సర్వే అని ఒకటి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే అధికార వైసీపీ 55.8 శాతం ఓట్లను కొల్లగొడుతుందని, తెలుగుదేశం పార్టీ ఓట్లశాతం మరింత తగ్గుతుందని సీపీఎస్ సర్వే అంచనా వేసింది. టీడీపీకి 38.3 శాతం ఓట్లు పోల్ అవుతాయని, భారతీయ జనతా పార్టీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేసినా 5.3 శాతానికి ఓట్ల శాతం పెరగపోవచ్చని పేర్కొంది. ఇంకా పలు అంశాలపై కూడా సి‌పి‌ఎస్ సర్వే వివరణ ఇచ్చింది. వాటిల్లో కూడా వైసీపీకే అనుకూలంగా ఉంది.

 

ఇక ఈ సర్వేపై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పాలనపై ప్రజలు ఎక్కువగా సంతోషంగా ఉన్నారని, భవిష్యత్‌లో కూడా తమకు తిరుగులేదని అంటున్నాయి. అయితే ఇక్కడే తెలుగు తమ్ముళ్ళు సరికొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ సర్వే అంతా ఫేక్ అని, ఈ లెక్కలు అన్నీ బోగస్ అని కొట్టిపారేస్తున్నాయి. అసలు ఈసర్వే ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

 

సర్వే గనుక నిజమని భావిస్తే ఒక్కసారి ప్రభుత్వాన్ని రద్దు చేసి, జగన్ ఎన్నికలకు వస్తే తేలిపోతుంది కదా అని అంటున్నారు. అయితే తాము ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సర్వేలే వచ్చాయని, ప్రతి ఏడాదికి చంద్రబాబుకు తిరుగులేదని కొన్ని సర్వేలు చెప్పాయని, కానీ అసలు ఎన్నికల్లో తమ పరిస్తితి ఏమైందో అందరికీ తెలుసని గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సర్వే జగన్‌కు సాటిలేదని అంటున్నారని, మరి అసలు ఎన్నికలకు వచ్చేసరికి పరిస్తితి ఎలా ఉంటుందో చూసుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: