ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 56 ను అమలు చేయాలని మెడిసిన్ విద్యార్థులు ఎన్టీఆర్ యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగారు. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను చేర్చుకోకుండా ప్రైవేట్ కళాశాలలు వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఒకపక్క న్యాయపోరాటం చేస్తూనే మరోపక్క ఎన్టీఆర్ యూనివర్సిటీ ముందు నిరసన దీక్ష చేపట్టారు. అడ్మిషన్లు పొందుకున్న తరువాత ప్రైవేటు కాలేజీ యాజమాన్యలు విద్యార్థులను అడ్డుకోవడంతో వారి భవిష్యత్తు ప్రస్తుతం ప్రమాదకరం లో పడింది.

 

మరోపక్క ఈ నెల 27 లోపు విద్యార్థులు కాలేజీలో చేరాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రైవేటు కళాశాలలు మొండి వైఖరి ప్రదర్శిస్తూ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను అడ్డుకోవడంతో తీవ్ర స్థాయిలో విద్యార్థుల నుండి నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో విద్యార్థులు ఒకపక్క హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే మరోపక్క ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ఆదుకోవాలని విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బాసటగా వైయస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తూ పీజీ మెడికల్ ఫీజు ను తగ్గించి జీవో నంబర్ 56 జారీ చేయటం అందరికీ తెలిసిందే. కానీ ప్రైవేట్ కళాశాలలు  మాత్రం  ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొండిగా వ్యవహరిస్తోంది.

 

కాగా ఈ విషయం ఒక పక్క న్యాయస్థానాల్లో ఉండటంతో వాయిదాలు మీద వాయిదాలు పడటంతో మరోపక్క ఆలిండియా స్థాయిలో కూడా సీటు పోయే అవకాశం ఉందని… దీంతో కెరియర్ అటు ఇటు కాకుండా ప్రమాదంలో పడే అవకాశముందని విద్యార్థులు అంటున్నారు. దీంతో 24 వ తారీకున అయినా న్యాయస్థానాలు మా విషయాల్లో న్యాయం తీర్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క జగన్ సర్కార్ కూడా ఆలోచించాలని విద్యార్థులు కోరుతున్నారు. పేద విద్యార్థుల జీవితాలపై ఫీజు భారం తగ్గించి చేతులు దులుపుకోవడం కాదు, ఈ  విషయంలో తగిన న్యాయం తీర్చాలని సీఎం జగన్ ని డిమాండ్ చేస్తున్నారు పీజీ విద్యార్థులు. కరోనా వైరస్ దేశ ప్రజలకు అంటకుండా ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్నది వైద్యులు… అలాంటిది మమ్మల్ని ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని విద్యార్థులు న్యాయస్థానాలు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం చెందుతున్నారు. ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: