మొన్నటికి మొన్న భారత్-చైనా సరిహద్దు లో జరిగిన ఘర్షణ చైనా పాకిస్థాన్లలో ప్రకంపనలు రేపుతోంది. కారణం చైనా భారత్  కు చెందిన సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో  ప్రత్యేకంగా భారతదేశానికి చెందిన ఇరవైఒక్క మంది సైనికులు అమరులు అయిన విషయం తెలిసిందే. అయితే దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన జవానుల అందరికీ భారతదేశం మొత్తం ఘన నివాళులర్పించింది. వారందరిపై పూల వర్షం కురిపించింది భారతదేశం. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఎంతో గొప్పగా వారికి ఘన నివాళులర్పించింది. అయితే ఇదే ఘర్షణలో అటు చైనా కు సంబంధించిన సైనికులు కూడా చాలా మంది చనిపోయిన విషయం తెలిసిందే. కానీ చైనా మాత్రం ఎవరు చనిపోయారు ఎంత మంది చనిపోయారు అనే విషయాన్ని రహస్యంగా ఉంచింది. 

 

 ఈ నేపథ్యంలో చైనా ప్రజలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన జవానులకు నివాళులు అర్పించని  దుస్థితి నెలకొందని.. వారి వివరాలను కూడా ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు అంటూ ఉద్యమ బాట పట్టారు. ప్రస్తుతం ఇదే తరహా తిరుగుబాటు పాకిస్థాన్లో కూడా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో భారత చేస్తున్న దాడుల్లో పాక్ సైన్యం చాలా మంది చనిపోతున్న విషయం తెలిసిందే, 

 

 అయితే పాకిస్తాన్లో దేశం కోసం పోరాడే ఒక సైనికుడు చనిపోతే కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే కుటుంబానికి ఇస్తారట. అంతేకాకుండా జీవిత కాలం వారికి ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఏం ఉండదట. అయితే భారత సైన్యం దాడుల్లో  హతమైన పాకిస్తాన్ సైనికుల్లో  కేవలం పంజాబ్ ప్రాంతంలోని సున్ని లకు  తప్ప మరెవ్వరికీ కూడా అధికారిక లాంఛనాలతో గౌరవం ఇవ్వడం లేదు అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తం సున్ని  కు సంబంధించినటువంటి దేశం కాబట్టి.. సైనికుడు సున్ని  వర్గానికి చెందిన వారు చనిపోతే తప్ప మిగతా వారు చనిపోయినప్పుడు ఇలాంటి గౌరవం దక్కడం లేదట. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోనే  తిరుగుబాటు వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: