తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుండి ప్రతి రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఈ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 879 పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే హైదరాబాద్, రంగారెడ్డి తో పాటు ప్రస్తుతం మిగితా జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం.
 
అందులో భాగంగా మేడ్చల్ లో ఈఒక్క రోజే 112 కేసులు నమోదుకావడం గమనార్హం అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈఒక్క రోజే 23పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అర్బన్ లో 9, రూరల్ లో14 కేసులు నమోదయ్యాయి. ఒక్క జిహెచ్ఎంసి లోనే 652కేసులు బయటపడ్డాయి. ఇక టెస్టులు కూడా భారీగా చేయకపోయినప్పటికి పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఈరోజు మొత్తం 3006 శాంపిల్ టెస్టులు మాత్రమే జరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈసంఖ్య తక్కువే..   
 
కాగా ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 9553 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 4224మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 5109కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనా తో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 220కి చేరింది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: