కేరళ లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే వుంది గత కొన్నిరోజుల నుండి ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా ఈరోజు కూడా  అదే సీన్  రిపీట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 141 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఓ కరోనా మరణం సంభవించింది కాగా మరో 60మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3451కేసులు నమోదుకాగా అందులో 1620కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1807మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు. 

ఇక మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే మహారాష్ట్ర కాకుండా ఢిల్లీ లో ఈరోజు అత్యధిక కేసులు నమోదకావడం గమనార్హం. ఢిల్లీ లో 3947కేసులు నమోదు కాగా మహారాష్ట్ర లో 3214కేసులు బయటపడ్డాయి. వీటి తరువాత అత్యధికంగా తమిళనాడు లో ఈరోజు  2516కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా  ఈఒక్క రోజే  దేశంలో  కరోనా కేసుల సంఖ్య 160000 దాటింది. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా  455000 కేసులు నమోదు కాగా 14300 మరణాలు చోటుచేసుకున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: