తెలిసో తెలియకో పెద్ద వారు చేసిన తప్పుల వల్ల ఒక్కోసారి పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.. పిల్లల పై ప్రేమతో వారు ఎక్కడ చెడిపోతారో అనే భయంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులు వారికి శిక్షలు విధిస్తారు.. కానీ ఆ మంచి ఆలోచన చెడును చేస్తుందని ఊహించలేం.. ఇప్పుడు మనం చదవబోయే విషయంలో ఇదే జరిగింది.. అమెరికాలోని కొలరాడోలో ఉంటున్న జాకరీ సబిన్ అనే 11 ఏళ్ల బాలుడు కొన్ని రోజులుగా మూత్ర సమస్యతో బాధపడుతున్నాడట. దీంతో వైద్యులకు చూపిస్తే అతని చేత రోజు తగినన్ని నీరు తాగించమని చెప్పగా ఇతని తండ్రి రైన్, పినతల్లి తారా రోజు నీళ్లు బాగా తాగమని చెప్పారట..

 

 

కాగా ఓ రోజు సబిన్ వాటర్ బాటిల్‌లో నీళ్లు చాలా ఉండే సరికి కోపంతో ఆ బాలుడి తల్లిదండ్రులు రోజంతా నీళ్లు తాగమని పనిష్మెంట్ ఇచ్చి తాము చెప్పేవరకు బయటకు రావద్దని తెలిపారు. దీంతో సబిన్ వంట గదిలో ఉండి సుమారు నాలుగు గంటల సేపు నీళ్లు తాగుతూనే ఉన్నాడట. ఫలితంగా అతడికి వాంతులు కూడా వచ్చాయి. అయినా సరే వారు అతడిని పట్టించుకోలేదు.

 

 

కొన్ని గంటల తర్వాత వంటగదిలోకి వెళ్లి చూడగా అక్కడ ఆ బాలుడు కిందపడి ఉన్నాడట.. అలా కిందపడి లేచిన సబిన్ తర్వాత వింతగా మాట్లాడటం మొదలు పెట్టాడట.. దీంతో అతడు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఇబ్బంది పడ్డాడని భావించిన వారు అతన్ని నిద్రపోవాలని చెప్పారు.

 

 

తర్వాత రోజు ఉదయం బెడ్ మీద పడుకుని ఉన్న సబిన్ శరీరమంతా చల్లగా మారిపోయి బిగుసుకుపోయి కనిపించగా, వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే సబిన్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.

 

 

ఇకపోతే ఆ బాలుడు ఎలాంటి ఆహారం తినకుండా నాలుగు గంటల సేపు సుమారు 83 లీటర్ల నీటిని తాగి ఉంటాడని అందువల్ల మరణించాడని వైద్యులు అంచనా వేశారు. ఆ తల్లిదండ్రులు మాత్రం తాము వేసిన శిక్ష వల్లే బాలుడు చనిపోయాడని భావించి పోలీసుల ముందు లొంగిపోయారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: