ఏపీలో ఇపుడు పదమూడు జిల్లాలు ఉన్నాయి. వాటిని పాతిక చేసేందుకు వైసీపీ తయారుగా ఉంది. నిజానికి తొలి ఏడాదిలోనే జగన్ చేయాలనుకున్నారు. కానీ జాతీయ జనా భా గణన పేరిట కేంద్ర పాలకులు  ఆపారు. అయితే కరోనా రావడంతో అది ఆగిపోయింది. ఇపుడు మళ్ళీ మొదలుపెట్టాలంటే టైం పడుతుంది. దాంతో అది కనుక అనౌన్స్ చేస్తే మరో ఏడాది పైగా కొత్త జిల్లాలకు పడుతుంది. దాంతో ఉన్న విలువైన సమయాన్ని వాడుకుని కొత్త జిల్లాలకు జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.

 

కొత్త ఏడాది అంటే 2021 నాటికి పాతిక జిల్లాలు చేయాలన్నది జగన్ ఆలోచన. రిపబ్లిక్ డే నాటికి కొత్త జిల్లాలు వస్తాయని అంటున్నారు. కొత్త జిల్లాల సంగతిని జగన్ జిల్లా కలెక్టర్లకు కూడా చెప్పెశారు. ఇపుడు ఉన్న ప్రతీ జిల్లాల‌కు ఇద్దరేసి జాయింటు కలెక్టర్లు ఉన్నారు. వీరంతా రేపటి రోజున కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా వస్తారని అంటున్నారు. దాంతో పాలనాపరంగా ముందే అన్నీ చూసుకుని జగన్ ఈ నియామకం చేశారని  అంటున్నారు.

 

మరో వైపు కొత్త జిల్లాల ఏర్పాటు తో రాజకీయాన్ని మరింతగా వికేంద్రీకరించి పట్టుపెంచుకోవాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో మండలాలు తెచ్చి ఎన్టీయార్ బాగా లాభపడ్డారు,బలపడ్డారు, ఇపుడు జగన్ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. నిజానికి చిన్న జిల్లాల వల్ల ఉపయోగం చాలానే ఉంటుంది. కేంద్రం నిధులు కూడా  జిల్లాల వారీగా అందుతాయి. అభివ్రుధ్ధి మీద మరింతగా గురి పెట్టినట్లుగా ఉంటుంది. అదే సమయంలో కరోనా వంటి విపత్తులు వస్తే జిల్లాలను ప్రమాణంగా తీసుకుని జనాలకు ఇంకా దగ్గరగా అవగాహన కల్పించడమే కాదు. కట్టడి కూడా చేసేందుకు వీలుంటుంది.

 

ఇక రాజకీయంగా చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి తనకు అనుకూలంగా జిల్లాల విభజన చేసుకుంటుంది. దాని వల్ల ఏ జిల్లాలోనైనా టీడీపీకి బలం ఉంటే దాన్ని విడగొట్టే వీలూంటుంది. అలా రెండు చేసిన తరువాత మరింతగా బలహీనపరచే అవకాశం ఉంటుంది. మొత్తానికి జగన్ దూర ద్రుష్టితోనే కొత్త జిల్లాలకు శ్రీకారం చుడుతున్నారు. అది సక్సెస్ అయితే వైసీపీకి తిరుగు ఉండదు అంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: