శానిటైజర్.. కరోనా వైరస్ నుండి.. ఇతర వైరస్ ల నుండి శానిటైజర్ మనల్ని రక్షిస్తుంది. అయితే ఆ శానిటైజర్ల నుండి కుడా మనకు ముప్పు ఉంది అని హెచ్చరిస్తోంది అమెరికా ఎఫ్‌డీఏ. అయితే ఒక్క శానిటైజర్ తో అని కాదు తొమ్మిది రకాల శానిటైజ‌ర్ల‌ను ఉపయోగించవద్దని అమెరికా హెచ్చరిస్తుంది. 

 

IHG

 

అయితే ఇప్ప‌టికే మార్కెట్ల‌కు త‌ర‌లించిన ఉత్ప‌త్తుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఎస్క్‌బయోకెమ్ సంస్థ‌‌ను ఆదేశించింది. ఈ సంస్థ త‌యారు చేసిన శానిటైజ‌ర్ల‌లో ప్ర‌మాద‌కర మిథ‌నాల్ ఉంద‌ని ఎఫ్‌డీఏ గుర్తించింది. ఇంకా ఆ ప్రమాదకర మిథనాల్ ఉన్న శానిటైజర్లు ఉపయోగించడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. 

 

IHG

 

ఇంకా ఈ శానిటైజర్ ను చేతులకు రాసుకున్నప్పుడు అది చర్మంలోకి వెళ్ళిపోతుంది అని దాని ఫ‌లితంగా వికారం, జ‌లుబు, వాంతులు, త‌ల‌నొప్పి, చూపు కోల్పోవ‌డం, కోమా, వ‌ణుకు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని కొన్నిసార్లు న‌రాల వ్య‌వ‌స్థ దెబ్బ‌తిని మ‌ర‌ణానికీ దారితీసే ప్ర‌మాదం ఉంది అని ఎఫ్‌డీఏ హెచ్చరించారు.

 

IHG

 

మార్కెట్ల‌లోని ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజ‌ర్‌, ఎస్క్ బ‌యోకెమ్ హ్యాండ్ శానిటైజ‌ర్, క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజ‌ర్, లావ‌ర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజ‌ర్, ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియ‌ల్ జెల్ హ్యాండ్ శానిటైజ‌ర్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజ‌ర్ 70% ఆల్క్‌హాల్‌, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజ‌ర్ 80% ఆల్క‌హాల్‌, శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను అసలీ ఉపయోగించవద్దు అని యమా డేంజర్ అని ఎఫ్‌డీఏ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: