సాధారణంగా చిన్న పిల్లలు ఏం చేసినా పెద్దవాళ్లకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అమాయకంగా వాళ్లు చేసే ఏ చిన్నపనైనా ఆ కుటుంబానికి ఎంతో మురిపెంగా అనిపిస్తుంది.  ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే వింతలూ విశేషాలు మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. భూమి, ఆకాశం, నీరు ఇక్కడ జరిగే ప్రతి ఒక్క వింతలూ విశేషాలు ఔత్సాహికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అబ్బుర పరుస్తున్నారు.  కొన్ని సార్లు ఇలాంటి చిత్రాలు చూస్తే నిజంగా ఇలా జరుగుతాయా అన్న ఆశ్చర్యంలో మునిగిపోతుంటాం. సాధారణంగా చిన్న పిల్లలు మారం చేస్తుంటే వారిని ఓదార్చడానికి పెద్దలు నానా తంటాలు పడుతుంటారు.. వారికి ఇష్టమైనవి ఇస్తూ బుజ్జగిస్తుంటారు.

 

పెద్దలు కోపంగా ఉన్నా.. మూడీగా ఉన్నా.. పిల్ల‌లు మాత్రం క్ష‌ణాల్లో ఇట్టే న‌వ్వు తెప్పించేయ‌గ‌ల‌రు.  ఇక పిల్లలు ఆడుకుంటున్న సమయాల్లో పెద్దలు వెయ్యి కళ్లు పెట్టుకొని చూడాల్సి ఉంటుంది..లేదంటే వారికి తెలియకుండా ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు.  తాజాగా ఓ చిన్నారి అద్దం ముందు చేసిన అల్లరి చూస్తే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. 54 సెకండ్ల పాటు న‌డిచే ఈ వీడియో చూస్తే ఎవ‌రికైనా న‌వ్వు రావాల్సిందే. అందుకోసం పిల్ల‌గాడు పెద్ద‌గా ఏం చేయ‌లేదు. త‌నంత‌ట తాను ఆడుకుంటున్నాడు.  వీడియోలో చూస్తున్న‌ట్ల‌యితే అది పెద్ద మాల్‌లా ఉంది. అక్క‌డ ఒక పెద్ద అద్దం ఉంది.

 

అందులో ఈ పిల్ల‌వాడు చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు పక్కన ఉన్నట్టుంది.. ఆ చిన్నారి అద్దం ముందుకు రాగానే తనకు ఎవరో ఎదురుగా ఉన్నట్లు ఆశ్చర్యపోయాడు. ప‌క్క‌కు వ‌స్తే ఆ బొమ్మ మ‌ర‌లా క‌నిపించ‌డం లేదు. ఎడ‌మ చేతివైపుకు వ‌స్తే మాత్రం మ‌ళ్లీ అదే బొమ్మ‌. అచ్చం నాలానే ఉంద‌ని పిల్లాడు అశ్చ‌ర్య‌పోతున్నాడు. ఇలా అటూ ఇటూ నడుస్తూ... వెనక్కి వెళ్లి చూస్తున్నాడు.  ఈ వీడియోని ఇండియ‌న్ యాక్ట‌ర్, క‌మేడియ‌న్‌,  డ్యాన్స‌ర్ అయిన జావేద్ జాఫేరి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది వైర‌ల్ అవుతున్న‌ది. పిల్ల‌ల ఆట‌లు చాలా ఫ‌న్నీగా ఉంటాయి అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: