దేశంలో కరోనా విలయతాండంవం రోజు రోజుకు పెరుగుతుంది కానీ తరగడం లేదు. అయితే తాజాగా బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు షాక్ ఇవ్వనుంది. అయితే దేశంలో గత కొద్దికాలంలో ఆర్థిక శాఖ మంత్రి బ్యాంకులపై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే జూన్ 30తో గడువు ముగుస్తుండడంతో జూలై 1నుండి కొత్త రూల్స్ ని తీసుకువస్తుంది.

 

 

అయితే సంబంధించిన పలు అంశాలు మారబోతున్నాయి. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో మార్పు రాబోతోంది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగానే ప్రభావం పడనుంది. జూలై 1 నుంచి మారబోతున్న బ్యాంక్ రూల్స్ ఏంటివో ఒకసారి తెలుకుందాం.

 

 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించిందని యాజమన్యం తెలియజేశారు. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో వచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాదారులకు గరిష్టంగా 3.25 శాతం వరకు వడ్డీ లభిస్తుందన్నారు.

 

 

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై చార్జీలు తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే వచ్చే నెల నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండకపోవచ్చునన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3 నెలలు వరకు మాత్రమే చార్జీల మినహాయింపు ఇచ్చారని తెలిపారు. ఇవి మళ్లీ వచ్చే నెల నుంచి అమలులోకి రానున్నాయి.

 

 

అంతేకాకుండా బ్యాంకు కస్టమర్లకు వచ్చే నెల నుంచి మరో షాక్ కూడ తగలనుందని సమాచారం. నిర్మలా సీతారామన్ గతంలో బ్యాంక్ ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ బెనిఫిట్ కూడా 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వచ్చే నెల నుంచి మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ అమలులోకి వస్తాయి. దీంతో మళ్లీ చార్జీలు బాదుడు మొదలవుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: