దేశంలో కరోనా వైరస్ ఎప్పుడైతే మొదలైందో.. చిన్నా పెద్ద.. సామాన్యులు నుంచి సెలబ్రెటీ ల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక రాజకీయ నేతల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలకు, వారి గన్ మెన్ లకు కరోనా వచ్చింది.  తమిళ నాట కరోనాతో ఓ ఎమ్మెల్యే కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాాగా  తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్, కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు.

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చాలా దురదృష్టకరం, ఫాల్టా నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1998 నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న తమోనాష్ ఘోష్ మనల్ని వీడి వెళ్లిపోయారు అని సోషల్ మాద్యంలో పోస్ట్ చేశారు.  ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని, ఈ సమయంలో ఆయన భార్య ఝార్నా, బంధుమిత్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. తమోనాష్ ఘోష్, గత 35 సంవత్సరాలుగా మనతో కలిసి పనిచేశారని, పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో శ్రమించారని, ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కొనియాడారు.  

 

ఇటీవల కరోనాతో తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజా జీవితంలో ఉంటూ కరోనా బారిన పడి మరణించిన తమోనాష్ ఘోష్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వెలిబుచ్చారు. ఈ మద్య పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: