గల్వాన్ లోయ ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దే దిశగా.. భారత్-చైనా అడుగు లేస్తున్నాయి. వెనక్కు వెళ్లేందుకు ఇరువురు పరస్పర అంగీకారానికొచ్చాయి. అయితే సైనిక బలగాల ఉపసంహరణకు ఎంత సమయం పటొచ్చు. తిరగి సాధారణ పరస్తితులు ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది. 

 

లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయలో ఇండో-చైనా ఘర్షణ వాతావరణం... ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. ఘటన తర్వాత చైనా, ఇండియా సరిహద్దుల్లో వెయ్యి ట్రూపులకు పైగా బలగాలను మోహరించాయి. ఇటు భారత వాయుసేన సైతం.. ఆయుధ సంపత్తిని తరలించింది.. సరిహద్దు ఘర్షణతో యుద్ధమేఘాలు ఆవరించాయి. దీంతో ఈ ఉద్రిక్తతలను చక్కదిద్దుకునేందుకు, ఇండియా-చైనా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మోల్డోలో పదిగంటల పాటు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో.. కార్ఫ్ కమాండర్ స్థాయిచర్చలు జరిగాయి. ఉద్రిక్త పరిస్థితుల నుంచి సాధారణానికి చేరేందుకు ఏకాభిప్రాయానికి వస్తున్నామని.. ఈ ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లేందుకు గానూ.. పరస్పర అంగీకారానికి వచ్చినట్లే అని ఆర్మీవర్గాలు తెలిపాయి.అయితే..వాస్తవాధీన రేఖ వెంబడి మే2వ తేదీ నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. 

 

ప్యాంగ్యాంగ్, గల్వాన్ ఘర్షణ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యాన్ని నిలువరించడం భారత్ ఆర్మీకి పెనుసవాలేనని చెప్పక తప్పదు. ప్యాంగ్యాంగ్ లేక్ దగ్గర ఒరిజినల్ ఫ్లాష్ పాయింట్ కు సంబంధించి.. ఇరు సైన్యాల మధ్య సుదీర్ఘ  కాలంగా బేధాభిప్రాయాలున్నాయి.  ప్రధానంగా ఫింగర్-4 , ఫింగర్ -8 మధ్య ప్రాంతాన్ని గ్రేజోన్ గా ఇరు సైన్యాలు పరిగణిస్తున్నాయి. వివాద పరిష్కారానికి రోడ్ మ్యాప్ గీయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్యాంగ్యాంగ్  సరస్సు దగ్గర మే 5 నాటి పరిస్థితులు నెలకొనాలని ఇండియా డిమాండ్ చేస్తోంది.

 

ఆర్మీ కమాండర్ స్థాయీ చర్చలైతే జరిగాయి. కానీ లద్దాఖ్ ప్రాంతం నుంచి సైనిక బలగాల ఉపసంహరణకు మాత్రం చాలా గడువు పడుతుందంటున్నారు భారత  రక్షణ రంగ నిపుణులు. ఎందుకంటే ఇరు దేశాలకు వ్యూహాత్మక ప్రదేశమైన ఫింగర్ పాయింట్-4, ఫింగర్ పాయింట్ల విషయంలో ఇరు దేశ సైన్యాలు అప్రమత్తంగానే ఉంటాయి. అదీ కాక ఓవైపు చర్చలంటూనే మరోవైపు.. కీలక ప్రాంతాలను కబ్జా చేయాలని డ్రాగన్ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈప్రాంతాల్లో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్.. సరిహద్దుల్లో మిలటరీ నిర్మాణాలు వేగవంతం చేస్తోంది.ఇలాంటి సంక్షుభిత సమయంలో అక్కడ నుంచి బలగాలు పూర్తిస్థాయిలో వెనక్కు జరగడం అంత సులభం కాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: