దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దాదాపు రెండు నెలల వరకు అన్ని కంపెనీలు, ఇతర వ్యవస్థలు మొత్తం మూసి వేశారు.  ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత కంపెనీలు  తెరుచుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత కంపెనీలు ఓపెన్ చేయడం.. ముఖ్యంగా కెమికల్ కంపెనీలు తెరుచుకునే నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు.. వారి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.  ఇటీవల విశాఖలో ఎల్ జీ పాలిమార్స్ గ్యాస్ లీక్ కావడంతో పద్నాలు మంది చనిపోగా ఎంతో మంది ఈ గ్యాస్ భారిన పడి అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డారు.   

 

పలు చోట్ల కంపెనీలు తెర్చుకోవడం అగ్ని ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. లాక్‌డౌన్ తర్వాత తెరుచుకుంటున్న ఫ్యాక్టరీల్లో నిర్వహణ సరిగ్గా లేదని మరోసారి రుజవైంది.  గుజరాత్‌లో ఓ ఫ్యాక్టరీ భారీ మంటల్లో చిక్కుకుంది. ఏకంగా 25 ఫైరింజన్లు తెప్పించి ఆర్పుతున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. అహ్మదాబాద్‌ సనంద్‌ ప్రాంతంలోని పారిశ్రామికవాడలో మధ్యాహ్నం ఓ ఫాక్టరీలో అగ్నికీలలు ఎగశాయి. ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుపోవడంతో స్థానికులు పరుగులు తీశారు.

 

ముడిపదార్థాలు కాలిపోతున్నాయని, షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శకటాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే ఎందుకు ఇలా అగ్ని ప్రమాదానికి గురైందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.  విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత దేశం నలుమూలలా ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదాలు, గ్యస్ లీకేజీలు నమోదవుతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: