మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న టైంలోనే అమెరికా కు వచ్చే వలసదారుల పై డోనాల్డ్ ట్రంప్ కు ఏప్రిల్ 3 నుంచి తాత్కాలిక నిషేధం విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం వైరస్ ప్రభావం ఇంకా దేశంలో ఎక్కువగా ఉండటంతో అమలులో ఉన్న నిషేధాన్ని డిసెంబర్ వరకు పొడిగిస్తూ ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో దేశంలో నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు ట్రంప్ హెచ్‌1-బీ, హెచ్-4 స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

 

ట్రంప్ నిర్ణ‌యంతో హెచ్‌1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్‌2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చేందుకు అవసరమైన అన్నిరకాల వీసాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అంతేకాకుండా వారికి వేషాల పై నిషేధం జూన్ 24 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. దీంతో ట్రంపు నిర్ణయం పై గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వలసదారుల పై ట్రంపు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని విమర్శించారు. అమెరికా ఆర్థిక రంగం ఈ స్థాయిలో విజయం సాధించింది అంటే దానిలో వలసదారుల పాత్ర ఎంతో కీలకమని  సుంద‌ర్ పిచాయ్ తెలిపారు. అంతేకాకుండా సాంకేతికపరంగా గ్లోబల్ లీడర్ గా అమెరికా అవతరించింది అంటే కూడా వలసదారుల సహకారంతోనే అని పేర్కొన్నారు.

 

అమెరికాలో గూగుల్ మరియు ఇంకొన్ని సంస్థలు టాప్ పొజిషన్ లో ఉండటానికి కారణం కూడా వారే అని వారి సహకారం వల్లే అమెరికా ఈ స్థాయిలో విజయాలు సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రభుత్వం సహకరించకపోయినా గూగుల్ సంస్థ మాత్రం కచ్చితంగా వలసదారులకు అండగా ఉంటుందని, ప్రోత్సహిస్తూనే ఉంటామని తెలిపారు. దీంతో గూగుల్ సీఈఓ  సుంద‌ర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలపై డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు అని అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఎలక్షన్ సమయంలో అమెరికాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా డోనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్న తరుణంలో గూగుల్ అధినేత ఈ విధంగా వ్యవహరించడం అమెరికా రాజకీయాల్లో కలకలం రేపినటు సమాచారం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో గూగుల్ మీద చర్యలు తీసుకోవడానికి డోనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: