ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీడియా ముందు బాగున్నా గాని అమలు చేస్తున్న విషయం లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో చాలా వరకు న్యాయ స్థానాలలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు బ్రేకులు పడిన విషయం అందరికీ తెలిసినదే. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో అధికార పార్టీపై సెటైర్లు వేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వ అధికారులు బలైపోతున్నారు అని విపక్ష పార్టీలు అంటున్నాయి. ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం తో ఏపీ ప్రభుత్వం పై నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రజలలో నెలకొన్న పరిస్థితి తాజా పరిణామాలను బట్టి పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇదిలా ఉండగా ఇప్పటికే రెండుసార్లు హైకోర్టు మెట్లు ఎక్కిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి ఈరోజు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యవహారంలో పట్టుబడ్డ వాహనాల విషయంలో కోర్టు మెట్లు ఎక్కారు. వాహనాలు తిరిగి అప్పగించే విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు అంటూ హైకోర్టులో ఇటీవల పిటిషనర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

 

ఈ విషయంలో ఎక్సైజ్శాఖ అధికారులు సరైన వివరణ న్యాయస్థానానికి  ఇవలేకపోవటంతో హైకోర్టు అసంతృప్తి చెంది స్వయంగా రాష్ట్ర డిజిపి వివరణ ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో బుధవారం నాడు ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని హైకోర్టుకి  వివరణ ఇచ్చారు.  గతంలో సి.ఎస్ తర్వాత ఏపీ డీజీపీ ఇలా ఉన్నత అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు న్యాయస్థానాలు దాక వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో ఏపీ ప్రభుత్వం పై నెగిటివ్ ఇంప్రెషన్ ప్రజలలో నెలకొన్న పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం మళ్లీ వీధుల్లో తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది

 

మరింత సమాచారం తెలుసుకోండి: