గాల్వాన్ లోయ లో భారత్ ఆర్మీ పై చైనా పథకం ప్రకారమే దాడి చేసిందని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెండు దేశాల మధ్య సైనికులు ఉపసంహరణ సరిహద్దుల మధ్య వివాదాల విషయంలో సామరస్య వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. సానుకూల వాతావరణంలో కమాండర్ స్థాయిలో చర్చలు జరగటంతో దాదాపూ చైనా మరియు ఇండియా మధ్య యుద్ధం కొనసాగే అవకాశం లేదని అంతర్జాతీయ స్థాయిలో తేలిపోయింది. ఇదిలా ఉండగా బలగాలను వెనక్కి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 

ఒకపక్క చర్చలు అంటూనే మరో పక్క డ్రాగన్ కీలక ప్రాంతాలను కబ్జా చేసే అవకాశం ఉన్నట్లు దీంతో ఇప్పుడప్పుడే సైనిక ఉపసంహరణ జరిగే అవకాశం లేనట్లు ఆర్మీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఘటన వెనకాల భారత ఆర్మీ సైనికులను రెచ్చగొట్టే విధంగా చైనా సీనియర్ అధికారి వ్యూహం ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టాయి. కరోనా దృష్టిని మళ్ళించడానికి భారత నీ దెబ్బ కొట్టాలని ప్రయత్నించిందని… కానీ భారత సైనికులు తిరగబడటం తో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అమెరికా ఇంటెలిజెన్స్ తెలిపింది. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కి కూడా ఈ ఘటనకు సంబంధించి ముందస్తు సమాచారం ఉందని అమెరికా వర్గాలు తెలిపాయి.

 

ఇదిలా ఉండగా చైనా యుద్ధంలో వెనకడుగు వేయడానికి కారణం పర్వత యుద్ధ రంగంలో భారత సైనికులకు మించి మరొకరు లేకపోవటంతో పాటు చైనా కి పర్వతాలపై యుద్ధం చేసే నైపుణ్యం లేకపోవటం వల్ల చైనా ఆర్మీ ఈ విషయంలో వెనకడుగు వేసినటు అమెరికా వర్గాలు తెలిపాయి. భారత సైనికులు ఎక్కువగా జమ్మూకాశ్మీర్ పర్వతశ్రేణుల్లో దాయాది దేశం పాకిస్థాన్ తో యుద్ధం చేయటంతో ఆ నైపుణ్యం వల్ల చైనా పర్వతశ్రేణుల దగ్గర భారత ఆర్మీ తో యుద్ధం అంటే మనకే భారీ డ్యామేజ్ వాళ్ళు చేస్తారు అని భావించి చైనా ఆర్మీ వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: