జగన్ సీఎం అయ్యాక ఏడాదికాలం లో 12 దేవాలయ భూముల విషయంలో తలెత్తిన వివాదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల టీటీడీ భూముల వ్యవహారం కూడా రాజకీయంగా పెద్ద చర్చకు కారణం అయింది. దీంతో టీటీడీ భూములను అమ్మటానికి వీలు లేదు అంటూ సీఎం జగన్ ఆదేశించడంతో అందుకు అనుకూలంగా టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఇతర దేవాలయాలకు సంబంధించి భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వ పెద్దల నుండి పక్క ఆదేశాలు అందాయి.

 

దీంతో ఎక్కడ ఎలాంటి అక్రమాలు దేవాదాయ భూముల విషయంలో జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యి చర్యలు తీసుకుంటున్నారు. సింహాచలం భూముల ఆక్రమణ విషయంలోనూ అప్పన్న కొండపై అక్రమ క్వారీల కు సహకరిస్తున్న ఈవో పై ఇటీవల సస్పెండ్ వేటు వేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం దేవాలయం బారి ఆన్లైన్ కుంభకోణం లో వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేసి, వారి నుంచి రికవరీ కూడా చేసింది. అంతేకాకుండా దీనిపై ఏసీబీ ఎంక్వయిరీ కూడా వేయడం జరిగింది.

 

ఇంకా ఇతర దేవాలయాల లోనూ ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు చేయడం జరిగింది. దేవాదాయ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పటినుంచి వైసిపి ఆరోపణలు చేస్తూ ఉంది. దీంతో ప్రస్తుతం అధికారంలోకి రావటం తోనే ఆక్రమణల నిజాలను వెలుగులోకి తీసుకురావటం కోసం సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. మొత్తంమీద దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా జగన్ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు అందుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: