బీజేపీ సిద్ధాంతాలు ఉన్న పార్టీ. జాతీయ వాదాన్ని నమ్ముకున్న పార్టీ. కొన్ని కచ్చితమైన విధానాలపైన ఆ పార్టీ పనిచేస్తుంది. అటువంటి బీజేపీ పరువు ఏపీలో తరచూ రోడ్డున పడుతోంది. బీజపీ తేడా గల పార్టీ అన్న దాన్ని కాలదన్నేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

 

మరీ ముఖ్యంగా బీజేపీలో కొత్త పూజారుల రాకతోనే గందరగోళం జరుగుతోంది అంటున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఇపుడు కేంద్ర హై కమాండ్ ద్రుష్టికి వెళ్లాయని అంటున్నారు. ముఖ్యంగా  తెలుగుదేశంతో సన్నిహితంగా కొందరు నాయకులు ఉండడాన్ని కూడా హై కమాండ్ సీరియస్ గా పరిగణిస్తోందని అంటున్నారు.

 

ఏపీలో కొందరు నేతలు టీడీపీ లైన్లో వెళ్తూ వైసీపీ సర్కార్ కి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అన్న సంగతి కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోందని అంటున్నరు. జాతీయ నాయకత్వానికి ప్రాంతీయ రాజకీయాల కంటే కూడా ఢిల్లీ ముఖ్యం. ఢిల్లీ వరకూ చూసుకుంటే వైసీపీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

 

22 మంది ఎంపీలు లోక్ సభలో వైసీపీకి ఉన్నారు. నాలుగవ పెద్ద పార్టీగా వైసీపీ అక్కడ  ఉంది. అదే సమయంలో ఆరుగురు ఎంపీలతో రాజ్యసభలో ఉంది. రాజ్యసభలో బీజేపీకి ఎన్డీయే కూటమితో కలుపుకుని వంద మంది వరకే సభ్యుల బలం ఉంది. 

 

అక్కడ బిల్లులు ఆమోదం పొందాలంటే మెజారిటీ రావాలి. 250 సీట్లు ఉన్న రాజ్యసభలో 123 మంది మద్దతు ఉంటేనే తప్ప రాజ్యసభలో బీజేపీకి బిల్లులు పాస్ కావు. అటువంటి టైంలో ఆరుగురు ఎంపీల బలం ఉన్న వైసీపీ అతి కీలకంగా ఉంది. మరి వైసీపీకి ఏపీలో ఒకరిద్దరు పార్టీ మారిన వారు ఇబ్బందులు పెడుతూంటే బీజేపీకే అది అంతిమంగా ఇబ్బంది అవుతుంది.

 

దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని బీజేపీ పెద్దలు టీడీపీకి సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ ప్రయోజనాలను ఏపీలో కాపాడుతున్న కొత్త పూజారుల విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా చెబుతున్నారు మరి చూడాలి బీజేపీ యాక్షన్ ఎలా ఉంటుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: