6వ విడత హరిత హారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సారి హరిత హారంలో అడవుల పునరుజ్జీవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది ప్రభుత్వం. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ అడవుల్లో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

 

2015 లో తెలంగాణకి హరిత హారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 5 విడతల హరిత హారం కార్యక్రమం పూర్తయింది. ఈ 5 విడతల్లో కలిపి 182 కోట్ల మొక్కలు నాటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 70 శాతం మొక్కలు బ్రతకాయని పేర్కొంది. 6 వ విడత హరిత హారం కింద 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుంది సర్కార్. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి ప్రారంభం అయ్యే 6 విడత హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ అడవుల్లో ప్రారంభించనున్నారు. ఈ సారి హరిత హారం లో అడవుల పునరుద్ధరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అడవుల్లో ఎక్కువగా మొక్కలు నాటనుంది అటవీ శాఖ.

 

మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ విషయం లోను చర్యలు తీసుకున్నామని.. నాటిన మొక్కల్లో 85 శాతం బ్రతకాలని స్థానిక సంస్థలకు కఠిన నిబంధనలు పెట్టామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కోతులు వాపస్ పోయేందుకు అడవుల్లో ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అటవీ విస్తీర్ణం 33 శాతానికి పెంచుతామని ఆయన తెలిపారు. 

 

ఈసారి 15 లక్షల మొక్కలు నాటాలని రోడ్లు భవనాల శాఖ డిసైడ్ అయింది. జాతీయ రహదారుల వెంట , రాష్ట్ర రహదారుల వెంట.. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాల్లో, ప్రభుత్వ గెస్ట్ హౌస్ ల్లో మొక్కలు నాటాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఇక గ్రేటర్ పరిధిలో రెండున్నర కోట్లు... హెచ్ఎమ్ డీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు నాటాలని మునిసిపల్ శాఖ డిసైడ్ అయింది. ఆర‌వ విడ‌త‌ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్యక్రమంలో పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేయాలని ‌మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: