కర్ణాటక రాష్ట్రంలో కరోనా పరంపర కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ బులిటెన్ ద్వారా వివరాలను తెలియజేశారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 10 వేల మార్కు దాటి, 10118 కు చేరుకుంది. ఇక రాష్ట్రంలో 3799  కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి అని బులిటెన్ ద్వారా తెలియజేశారు. అందులో 112 మంది ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఐసీయూలో ఉంచి  వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

 

 


మరోవైపు నేడు ఒక రోజే కోవిడ్ బారిన పడి 14 మంది మృతి చెందారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 164 మంది మృత్యువాత పడ్డారు. నేడు ఒక్కరోజే 149 మంది కరోనా వైరస్ బారి నుండి బయటపడి వారి ఇళ్లకు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6151 మంది covid -19 నుండి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.


24 గంటల్లో విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ తేలగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 75 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. ఇక నేడు నమోదయిన పాజిటివ్ కేసులలో 172 కేసులు బెంగళూరు నగరంలోని  నిర్ధారణ అవ్వడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: