తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజికవర్గానికి పెద్ద అడ్డా లాంటిదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ పార్టీలో కమ్మ నేతల ఆధిపత్యమే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఇటు వైసీపీలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందనే సంగతి కూడా తెలిసిందే. అయితే టీడీపీని దెబ్బతీయడానికి జగన్ అదే కమ్మ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాజకీయం చేస్తుంటారు.

 

అలాంటి రాజకీయం చేయడం వల్లే 2019 ఎన్నికల్లో కొందరు టీడీపీ కమ్మ సీనియర్ నేతలకు అదే సామాజికవర్గ నేతలతో చెక్ పెట్టించారు. గుంటూరు జిల్లా వినుకొండలో టీడీపీ సీనియర్ నేత జి‌వి ఆంజనేయులుని వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఓడించారు. అలాగే పెదకూరపాడులో టీడీపీ సీనియర్ నేత కొమ్మాలపాటి శ్రీధర్‌పై నంబూరు శంకర్ రావు గెలిచారు. తెనాలిలో ఆలపాటి రాజాపై అన్నాబత్తుని శివకుమార్, కృష్ణా జిల్లా మైలవరంలో దేవినేని ఉమాపై వసంత కృష్ణప్రసాద్,  పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌పై కొఠారి అబ్బయ్య చౌదరీలు విజయం సాధించారు.

 

అయితే ఈ ఏడాది సమయంలో ఈ టీడీపీ కమ్మ నేతలకు వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలు పుంజుకునే స్కోప్ ఇవ్వ లేదని తెలుస్తోంది. రోజురోజుకూ వైసీపీ ఎమ్మెల్యేలు బలపడుతున్నట్లు కనపడుతుంది. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, అటు జగన్ అద్భుతమైన ప్రభుత్వ పథకాలు ఇస్తుండటంతో ఇంకా అక్కడి ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

అలాగే ఆ నియోజకవర్గాల్లో ఉన్న కమ్మ ఓటర్లు కూడా పరోక్షంగా వైసీపీకే మద్ధతు పలుకుతున్నారని, సైలెంట్‌గా వారి పనులు చేయించుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ ఇస్తున్నారని సమాచారం. దీని వల్ల టీడీపీ కమ్మ నేతలు పుంజుకోవడం కష్టంగా ఉందని, ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిస్తితి అయితే మరి ఘోరంగా ఉందని తెలుస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీకి ప్రజాభిమానం పెరగడం, చింతమనేనికి మైనస్ అవుతుంది. మొత్తానికైతే వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలు... టీడీపీ కమ్మ నేతలకు పుంజుకునే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: