ఒకవైపు సొంత పార్టీ నేతల అసంతృప్తి, మరోవైపు కోర్టు వ్యవహారాలు, ఇంకోవైపు కరోనా వైరస్ ప్రభావం ఇలా అన్ని వైపులా ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, సీఎం జగన్ ఎక్కడా కంగారు పడటం లేదు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఏపి క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతుండడంతో ఆ సందడి ఎక్కువయ్యింది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ఏపీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ, త్వరలోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో, ఆ రెండు స్థానాల్లో మంత్రులుగా ఎవరు వస్తారు అనేది ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశం అవుతోంది.

IHG


 ఇప్పటికే పెద్ద ఎత్తున ఆశావాహులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. కాకపోతే జగన్ మాత్రం ప్రస్తుతం రాజీనామా చేయబోయే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గాలకు చెందిన వారిని మంత్రులుగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో వైసీపీలో బలమైన వాయిస్ వినిపిస్తూ వస్తున్న కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. అలాగే తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేకు చెందిన పొన్నాడ సతీష్ కూడా మోపిదేవి వెంకటరమణ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో, ఆయన పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.


 
 వారినే జగన్ దాదాపు ఫైనల్ చేశారని ప్రచారం ప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. వీరు కాకుండా మరో ఇద్దరు మంత్రుల పనితీరు పై జగన్ అసంతృప్తిగా ఉన్నారని, వారిని తప్పించి ఆ స్థానంలో మరో ఇద్దరు, తనకు అత్యంత సన్నిహితులైన వారిని తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: