ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడిప్పుడే బీజేపీ అగ్రనేతలకు అర్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అసలు ఇప్పటి వరకు ఏపీలో బలపడ లేకపోవడానికి కారణం సొంత పార్టీ నాయకుల తప్పిదాలే కారణమని, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు తో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని బాధ ఆ పార్టీ అగ్రనేతల్లో ఇప్పటికీ కనిపిస్తోంది. కానీ దాని నుంచి ఇప్పటికీ బయటపడలేనే స్థితిలో కేంద్ర అధికార పార్టీ బిజెపి ఉంది. ఏపీలో ఆ పార్టీ కి భవిష్యత్తు ఉంది. అయినా ఆ ఇప్పటికీ ఆ పార్టీ బలపడ లేక పోవడానికి కారణం ఏంటనేది విశ్లేషించుకోవడం లేదు. బిజెపికి రాజ్యసభలో తక్కువ బలం ఉందన్న కారణంతో టిడిపి నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను ఆ పార్టీలో చేర్చుకున్నారు. అయితే వారంతా చంద్రబాబు సూచనలతోనే బిజెపిలో చేరి ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. 

IHG's Lies!

ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో బిజెపి నాయకులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో బిజెపి కంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా రియాక్ట్ అయి, వారిని వెనకేసుకు వస్తోంది. ఘనమైన చరిత్ర ఉన్న బీజేపీకి ఇటువంటి సీక్రెట్ రాజకీయాలు ఏపీలో చేసిన చరిత్ర లేదు. బిజెపిలో మిగతా నాయకులు ఉన్న ఈ స్థాయిలో ఎవరూ  రాజకీయం చేయలేదు అనేది అందరి మాట. కానీ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సీక్రెట్ గా సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు మంత్రంగా చేయడం బిజెపి పరువు పోయినట్లు అయింది. కేవలం చంద్రబాబుకు మేలు చేసే విధంగా సుజనా చౌదరి వ్యవహరించడంతో   బిజెపి ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడింది అనేది ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఆవేదన.


 అసలు బిజెపి ఏపీలో ఎదగకపోవడానికి ఇటువంటి అనుమానస్పద రాజకీయాలు చేసే నాయకులే కారణమని, బీజేపీ లో ఉంటూ తెలుగుదేశం పార్టీ బలపడాలని చూసే వారి వల్ల ఉపయోగం ఏమి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ పరువు ఎలాగో పోయింది.. ఇప్పుడు ఈ వ్యవహారంలో బిజెపి కూడా నిందలు మోయాల్సి వస్తోంది. ఇప్పటికైనా బిజెపిలో ఉన్న టీడీపీ కోవర్టు లను గుర్తించి అదుపు చేస్తుందో, లేక అలా వదిలేస్తుందా అనే దానిపైనే ఏపీలో బిజెపి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: