తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి బాగా అర్థం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఏపీ మాజీమంత్రి బిజెపి నాయకుడు, కామినేని శ్రీనివాసరావు ఈ ముగ్గురు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో భేటీ అయినా దృశ్యాలు ఇప్పుడు మీడియాలో బయటికి రావడం, దీనిపై రాజకీయ చర్చ జరగడం తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కానీ , సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు తో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ, ఆ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తల దూర్చింది. వారు ముగ్గురు కలిసి  మాట్లాడుకుంటే తప్పు ఏంటి అంటూ టిడిపి వారి తరఫున మాట్లాడడం, జనాల్లో ఇంకా అనుమానాలు పెంచింది. 

 

IHG


నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస రావు, సుజనా చౌదరి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నానా తంటాలు పడుతోంది. ఈ ముగ్గురు వ్యవహారం తమకు సంబంధం లేదని టీడీపీ తెలివిగా తప్పించుకుని ఉంటే, ఇప్పుడు ఇబ్బందులు పడేది కాదు. అలా కాకుండా వారిని వెనకేసుకురావడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. సుజనాచౌదరి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన బిజెపిలోకి వెళ్లారు. అక్కడికి వెళ్ళినా, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఢిల్లీ రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు చంద్రబాబు చెవిన వేస్తుంటారనేది రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ.


 కేవలం అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విషయంలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు రహస్య మీటింగ్ చంద్రబాబు ఏర్పాటు చేయించారు అనే అనుమానాలు ఇప్పుడు ప్రచారం ఇప్పుడు ఏపీలో ఎక్కువయ్యాయి. వాటితో తమకు సంబంధం లేదని ఇప్పుడు టిడిపి ఎంత వాదిస్తున్నా, ఈ వ్యవహారం బయటపడిన తర్వాత వారిని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ మాట్లాడడంతో ఇప్పుడు ఆ పార్టీ ఇరుకున పడినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: