రాజకీయాలంటే ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏ విధంగా మారుతాయో, ఎవరూ చెప్పలేము. అప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న వారు మిత్రులుగా మారవచ్చు. మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారవచ్చు. ఇక విషయానికి వస్తే జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు అధికారిగా, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అప్పట్లో చాలా పాపులర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలల పాటు జైలు కు కూడా పంపించారు. ఈ కేసు ఇలా సాగుతుండగా, ఆయన మహారాష్ట్ర క్యాడర్ కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం, జనసేన పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేయడం, ఓటమి చెందడం ఇలా ఎన్నో పరిణామాలు జరిగిపోయాయి. 

IHG

జేడీ ఆలోచనలకు, జనసేన పార్టీ విధానాలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన వైసీపీకి అనుకూలంగా జగన్ ను సందర్భం దొరికినప్పుడల్లా పొగుడుతూ వస్తుండడంతో, ఆయన వైసీపీలో చేరతారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అలాగే కొద్ది రోజుల క్రితం జగన్ ఏడాది పరిపాలనపైనా జేడీ ప్రశంసించారు. ప్రజలకు ఏం కావాలో, అది జగన్ చేసి చూపిస్తున్నారని పొగిడారు. ఇక తాను వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన కొద్దిరోజులుగా సంకేతాలు పంపిస్తున్నారు. 

 

IHG

త్వరలోనే ఆయన వైసిపి గూటికి చేరే అవకాశాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే తనను జైలుకు పంపించి, తనమీద అవినీతి ముద్ర పడేలా చేసిన జేడీని అంత సులువుగా జగన్ పార్టీలో చేర్చుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమో చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: