తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీ స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆఖరికి కరోనా కేసుల సంఖ్య ప‌దివేలు దాటింది.

 

గత 24 గంటల్లో మొత్తం 891 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఒకే రోజులో ఇప్పటి వరకూ న‌మోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం కాగా.. గత వారం రోజుల నుండి తెలంగాణ లో ఇదే పరిస్థితి నెలకొంది.

 

రోజు మరో ఐదుగురు మృతిచెందారు. తాజాగా తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలో719, రంగారెడ్డి 86, మేడ్చల్ 55, సంగారెడ్డి 2, కామారెడ్డి 1, కరీంనగర్ 2, ఖమ్మం 4, భద్రాద్రి 6, సిద్దిపేట 1, మహబూబాద్ 1, నల్గొండ 2, గద్వాల1, వరంగల్ రూరల్ 3, వరంగల్అర్బన్ 3, నిజామాబాద్ 1, ఆదిలాబాద్ 1 కేసుల చొప్పున నమోదయ్యాయి.

 

మరోవైపు, తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యను బుధవారం మరింతగా పెంచారు. ఒక్కరోజులో 4069 కరోనా టెస్టులు చేశారు. మంగళవారంతో పోలిస్తే దాదాపు వెయ్యి టెస్టులు ఎక్కువగా చేశారు. వీటిలో నుంచే 891 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 67,318కు చేరింది. బుధవారం 3,178 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

 

ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కోలుకొని భారీ సంఖ్యలో టెస్టులు చేయబట్టే స్థాయిలో కేసులు బయటపడుతున్నాయని ఆరోహ్య నిపుంఉలు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో ఇంతలి మించిన తీవ్రతను రాష్ట్ర ప్రజలు చూడవలసి వస్తుందని అన్నారు.ఇక ఆగస్టు మొదలయ్యే సమయానికి మరో పది వేల కేసులు చాలా సులువుగా నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: