ప్రపంచ దేశాలన్నింటికీ వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా కు మందు కనిపెట్టేశాం అని ఘనంగా ప్రకటించుకుంది మనమే. స్వల్ప మరియు మధ్యస్థ లక్షణాలతో బాధపడే రోగులకు గ్లెన్ మార్క్ మందు బాగా పని చేస్తుందని మరియు మరీ ముఖ్యంగా మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారు కూడా దీనిని వాడవచ్చు అని అధికారికంగా ప్రకటించింది సదరు ఫార్మా కంపెనీ. ఇక మందు పేరు ఫవిపిరవర్. కొందరిపై ట్రయల్స్ కూడా వేసిన మందు పూర్తిగా పాజిటివ్ ఫలితాలు ఇవ్వడంతో ఐసీఎంఆర్ కూడా దీనికి ఎమర్జెన్సీ మెడిసిన్ కేటగిరిలో ఆగమేఘాలమీద పర్మిషన్ ఇచ్చేసింది.

 

కరోనా ప్రపంచ సమస్య అని అందరూ ఒప్పుకోవాల్సిందే. వ్యాక్సిన్ గాని మందు గాని త్వరగా కనిపెట్టకపోతే దాని వల్ల జరిగే అనర్థాలు ఊహాతీతం. అయితే దీనికి మందు కనిపెట్టిన ఫార్మా కంపెనీలకు కోట్లు కోట్లు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనాకు మందు గా చెప్పబడే ఫవిపిరవర్ ఖరీదు 103 రూపాయలు కానీ ఒక రోగి కనీసం 14 వేల రూపాయల విలువైన మాత్రల్ని వేసుకోవాల్సి ఉంటుంది అని మాత్రం ఎవరికీ తెలియదు. దీనికి ఇతర లక్షణాలకి వాడే మందులు అదనం. అవును ఇదే నిజం ఎలాగంటే...

 

తొలి రోజున పద్దెనిమిది టాబ్లెట్ లు వేసుకోవాలి - 9 ప్లస్ 9. తర్వాత రోజున 8 టాబ్లెట్లు - 4 ప్లస్ 4. ఇలా 2 వారాలు కొనసాగించాలి. అంటే మొత్తం 130 టాబ్లెట్లు అన్నమాట 34 టాబ్లెట్లు ఉండే ఒక్క స్ట్రిప్ రూ.3500 అంటే మొత్తం మీద 4 స్ట్రిప్స్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. మొత్తం కలిపితే 14 వేల రూపాయలు. సరేలే చివరికి కరోనా నుండి విముక్తి లభించింది కదా అని అనుకుంటే దానితో పాటు ఇంకా మందులు వాడాల్సి ఉంటుంది. అది మాత్రం ఎవరికీ తెలియదు.

 

ఇంత మొత్తంలో ఒకే రోజు అన్ని మందులు వేసుకుంటే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నా.. కూడా దాంతో కూడా కచ్చితంగా గ్యాస్ టాబ్లెట్లు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇకపోతే పొరపాటున ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇవి వాడడం తో పాటు కూడా ఇంకా అదనంగా ఏవే మందులు వేసుకోవాలి అనే విషయంపై ఎవరికి ఇంకా స్పష్టత లేదు. దానికి డాక్టర్ల సహాయం అవసరం మరియు అది ఒక అదనపు ఖర్చు. ఇదంతా నెగిటివ్ గా మాట్లాడట్లేదు కానీ ఏదైనా మంచి జరిగింది అని సంబరపడే బదులుగా దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఇందులో మనం ముందస్తుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకుని సంబరపడితే బాగుంటుందని అని వివరణ ఇవ్వడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: