లాక్ డౌన్ ముండి సడలింపులు ఇచ్చిన తర్వాత దేశంలోని చాలా రాష్ట్రాలు బస్సు సర్వీసులను పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆర్టీసీ బస్సులు నడవడం మొదలయ్యాయి. అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ రాష్ట్రంలోని నలుమూలల బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. సామాజిక దూరం పాటిస్తున్నారు.. ఎంత జాగ్రత్తగా బస్సులు నడుపుతున్నారు కానీ కరోనా వ్యాప్తిని మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు.

 

తాజాగా తెలంగాణ ఆర్టీసీ లో 20 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు గా గుర్తించారు. అయితే బస్సులో డ్రైవర్ తప్పించి కండక్టర్ తో పాటు ఇతర సిబ్బంది ఎవరూ ప్రయాణికులతో ఉండేందుకు వీలు లేదు కనుక దాదాపు ప్రయాణికులు ప్రస్తుతానికి సురక్షితం అని తేల్చారు. అయితే ఇరవై మంది సిబ్బందితో పాటు వారి సన్నిహితులను మరియు కుటుంబ సభ్యులను వెంటనే క్వారంటైన్ కు తరలించినట్లు సమాచారం. ఆర్టీసీ సిబ్బంది లో ఇంత మందికి కరోనా సోకడంతో తెలంగాణ ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

 

ఇకపోతే ఆర్టీసీ బస్సులు ఏవీ సామాజిక దూరం పాటించాలని దృష్టిలో ఉంచుకొని గతంలో నడపలేదు.. సీటింగ్ అలా తయారు చేయనూ లేదు. కావున ఎంత సామాజిక దూరం పాటించినా కొన్ని జాగ్రత్తలు తప్పక పాతించాలి. టికెట్ తీసుకునేటప్పుడు ఆర్టీసీ సిబ్బంది కి మరియు తోటి ప్రయాణీకులకు దూరంగా ఉండాలి. శానిటైజర్ ఎల్లవేళలా కూడా ఉంచుకొని ప్రయాణించడం శ్రేయస్కరం. అంతేకాకుండా ప్రయాణం చేస్తున్నంతసేపు మరియు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకునే లోపల మన చేతులతో ముఖాన్ని తాకకుండా ఉంటే సరిపోతుంది. మాస్క్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఉదాహరణకు నిన్ననే త‌మిళ‌నాడుకు చెందిన ఇద్ద‌రు దంప‌తులు.. ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం కంటే ముందు రోజు క‌రోనా ప‌రీక్ష‌ల నిమిత్తం త‌మ ర‌క్త న‌మూనాల‌ను ఇచ్చారు. ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అయితే ర‌క్త న‌మూనాల‌ను ఇచ్చిన మ‌రుస‌టి రోజు దంప‌తులిద్ద‌రూ.. క‌డ‌లూరు జిల్లా నుంచి త‌మిళ‌నాడులోని నెయెవెల్లికి ఆర్టీసీ బ‌స్సులో బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్య‌లోనే వారికి వైద్యాధికారుల నుంచి ఫోన్ వ‌చ్చింది. మీకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు చెప్పారు. కాబట్టి ఎంత నివారించినా దీనిని  నుండి తప్పించుకోవడం కష్టం కాబట్టి.... తస్మాత్ జాగ్రత్త!

మరింత సమాచారం తెలుసుకోండి: