అదేంటి పులికి డబ్బులు పెట్టి, తిండి పెట్టవలసిన అవసరం లేదు కదా.. దాని తిండి అదే సంపాదించుకుంటుందిగా అని అనుకుంటున్నారా.. అవును అది నిజమే గానీ ఆ పైన కనిపించే మొత్తం అటవిశాఖ అధికారులు పులుల వల్ల నష్టపోయిన వారికి చెల్లించిన పరిహారము.. మనుషులకు దగ్గరలో ఉన్న అడవుల్లో సంచరించే పులుల వల్ల నష్టపోయిన వారు అందుకున్న పైకము.. అదెలా అంటే మేత కోసం అడవికి వెళ్లిన రైతుల పశువులను హతమారుస్తూ పులి తన ఆకలి తీర్చుకుంటోంది. దీంతో సదరు రైతులకు పరిహారం రూపంలో అటవీశాఖ డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఆ డబ్బులే ఇప్పటి వరకు పెరిగి పెరిగి రూ.21లక్షలు అయ్యాయట..

 

 

ప్రతి నెలా ఇలా పులి ఆకలి ఖర్చు పెరిగిపోతోంది. ఇకపోతే అధికారిక గణాంకాలు ఒక్కసారి పరిశీలిస్తే గతేడాది ఒక్క కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనే 77 పశువులు పులికి ఆహారమయ్యాయట. అందుకు గాను రూ. 9.62 లక్షలు పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించారు. తాజాగా ఈ ఏడాదిలో మరో 5 పశువులపై దాడిచేయగా.. రూ.38 వేలు చెల్లించారు. ఒక్క చెన్నూరు డివిజన్‌లో పులి దాడిలో 50 కిపైగా పశువులు చనిపోగా రూ.6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలో 32 పశువులకు గాను రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించారట.

 

 

ఇదిలా ఉండగా మనుషులు చేసిన తప్పిదము అంటే విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవాణాతో శాకాహార జంతువుల సమతుల్యత దెబ్బ తింది. దీని వల్ల ఈ పులులు పశువులను వెటాడి తమ ఆకలి తీర్చుకుంటున్నాయి.. అదీగాక పంది, జింక, దుప్పి, నీల్గాయి లాంటివి వేటాడటం కంటే మేతకు వెళ్లిన పశువులను వేటాడటం వీటికి సులభంగా మారింది. ఇదిలా ఉండగా పులి దాడిలో మరణించిన పశువులకు అటవీశాఖ అధికారులు పశువును బట్టి నష్టపరిహారం చెల్లిస్తున్నారట. ఇదేకాకుండా పశువులు పులుల బారిన పడకుండా అటవీ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కలిగిస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: