తెలుగుదేశం పార్టీ నాయకులతో జైలు బాట కార్యక్రమం మొదలుపెట్టినట్టుగా ఏపీ ప్రభుత్వం వరుసగా టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్ చేసుకుంది. గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అవినీతి వ్యవహారాలను విచారణ చేస్తూ, సాక్ష్యాధారాలతో సహా నాయకులందరినీ జైలుకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి టీడీపీ కీలక నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లారు. ఆయనను అరెస్టు చేసి తీసుకువెళుతున్న సమయంలో జాతీయ రహదారిపై పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక మరో కేసులో అనంతపురం జిల్లా కీలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు.

IHG


 ఇక ఆ తర్వాత అరెస్టుల పర్వం బ్రేక్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లోకేష్ ను టార్గెట్ చేసుకున్నట్టుగా సంకేతాలు ఇస్తోంది. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వం లో ఐటీ శాఖ మంత్రి గా లోకేష్ బాధ్యతలు చేపట్టిన సమయంలో, ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు జగన్ కు నివేదిక ఇచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 2015 జూలై 7వ తేదీన, 329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 


ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ టెండర్లలో ఈ పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరా సాఫ్ట్  అనే సంస్థను 2015 మే 11  న  ఏపీటిఎస్( ఆంధ్రప్రదశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈ బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు టెండర్లు దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈవీఎం చోరీ కేసులో నిందితుడుగా ఉన్న చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన హరికృష్ణ కు చెందిన టెరా సాఫ్ట్  బిడ్ ను ఆమోదించాలని తెలుగుదేశం పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో, ఇప్పుడు ఈ వ్యవహారంలో లోకేష్ కు మరో వారం రోజుల్లో నోటీసులు అందించబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: