ఏపీ రాజకీయాల్లో గల్లా ఫ్యామిలీ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గల్లా ఫ్యామిలీ ముందు నుంచి కూడా  కాంగ్రెస్ లో బలమైన కుటుంబం గా పైకి వచ్చింది. గ‌ల్లా రాజ్‌గోపాల్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి చిత్తూరు జిల్లా రాజ‌కీయాల‌ను ఓ రేంజ్లో శాసించారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌కు ఆయ‌నే రాజ‌కీయ గురువు అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన గ‌ల్లా అరుణ కుమారి సైతం నాలుగు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రిగా ప‌నిచేశారు.

 

2014 ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడం తో టీడీపీలో జాయిన్ అయింది గల్లా ఫ్యామిలీ. ఆ ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన జ‌య‌దేవ్ గెల‌వగా.. చంద్ర‌గిరిలో పోటీ చేసిన గ‌ల్లా అరుణ కుమారి ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఇక మొన్న‌టి ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీగా గల్లా రెండోసారి గెలిచారు. ఇప్పుడు గల్లా జయదేవ్  టీడీపీ నుంచి ఎంపీ గా ఉన్నారు. ఇక ఆయనకు బలమైన క్యాడర్ కూడా ఉంది. 

 

మొన్న‌టి ఎన్నిక‌ల్లో పార్టీపై ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త త‌ట్టుకుని గెలిచిన గల్లా జయదేవ్ ఈ మధ్య తీవ్ర అసహనంగా ఉన్నారు అనే టాక్ బాగానే వినపడుతుంది. గల్లా జయదేవ్ కి ప్రాధాన్యత లేదు అని రామ్మోహన్ నాయుడు కి చంద్రబాబు నుంచి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అనే వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  మొన్నా మధ్య అమరావతి విషయంలో గల్లాను అదుపులోకి తీసుకున్నప్పుడు చంద్రబాబు నుంచి పెద్దగా స్పందన లేదు. 

 

కాని ఇప్పుడు అచ్చెన్నాయుడు ని అదుపులోకి తీసుకున్న వెంటనే చంద్రబాబు నుంచి వేగంగా స్పందన అనేది వచ్చింది. దీనితో గల్లాలో అసహనం ఉందని అదే విధంగా పార్టీ రాష్ట్ర బాధ్యతలు  కూడా రామ్మోహన్ నాయుడు కే అప్పగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు అన్న టాక్ టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ వార్త‌ల‌తోనే గల్లా అసహనంగా ఉన్నారట. దీనితో ఇప్పుడు ఆయనకు పార్టీ మారే ఆలోచన ఉందని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: