ప్రస్తుతం కరోనా వైరస్ మన దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఎక్క‌డో చైనా దేశం వుహాన్ ప‌ట్ట‌ణంలో పుట్టి.. అతి త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌పంచ‌దేశాలను అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.. కరోనా వల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. కంటికి క‌నిపించ‌కుండా ఈ క‌రోనా భూతం యావ‌త్ దేశాల‌ను వ‌ణికిస్తోంది. మ‌రోవైపు కరోనా ఎఫెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

 


దీంతో ఉద్యోగులు రోడ్డున ప‌డుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మరి దారుణంగా మారింది. తినడానికి తిండి దొరికాక చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎంత చదువు చదివినా ఉద్యోగాలు లేక యువత చాల ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో ప్రభుత్వం నుండి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో యువత కలత చెందుతున్నారు.

 

 

ఇలాంటి స‌మ‌యంలో యువతకు అండగా నిలవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో శుభవార్తను తీసుకువచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్యూటీ డైరెక్టర్, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెంట్రల్ ఇంటిలిజెన్స్, పీఏ, స్టాఫ్ నర్సులు వంటి పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ 19 ఆగస్ట్ 2020. అయితే మొత్తం పోస్టులు 292లను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంది.

 


ఉద్యోగం దేశ వ్యాప్తంగా ఎక్కడైనా చేయాల్సి ఉంటుందని తెలిపారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ పూర్త చేసి ఉండాలి. వయస్సు 56 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.పూర్తి చేసిన దరఖాస్తు పంపించవలసిన చిరునామా Joint Deputy Director/G, Intelligence Bureau, Ministry of home Affairs, 35 S.P. Marg, bapu Cham, New Delhi-21 పంపించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: