కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ చిన్నగా వ్యాపిస్తూ అగ్రరాజ్యాలను సైతం కుదిపేసింది. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ఇప్పుడు మన భారత్ లో కూడా చుక్కలు చూపిస్తుంది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. 

 

 

అలాంటి కరోనా వైరస్ ను అంతం చెయ్యాలి అంటే ఓ వ్యాయామం చెయ్యమంటున్నారు వైద్య నిపుణులు.. అయితే నిజానికి కొందరు హెర్బల్ టీ తాగమని సూచిస్తే మరికొందరు ఉల్లిపాయ టీ తాగాలి అని సూచిస్తున్నారు. మరి కొందరు 34 నిమిషాలు సూర్య రష్మీలో ఉంటే సరిపోతుంది అని సూచిస్తున్నారు. 

 

IHG

 

అయితే ఇప్పుడు కూడా యోగాలో భాగమైన బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ని చెయ్యాలి అని సూచిస్తున్నారు. ముక్కుతో గాఢంగా గాలిని పీల్చుకొని నోటి నుంచి వదలడం ద్వారా పలు రకాల వైరస్‌ల బారి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకోవచ్చని అంటున్నారు నోబెల్‌ బహుమతి గ్రహీత, స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లూయీ జే ఇగ్నారో. 

 

IHG


ముక్కుతో గాలి పీల్చడం వల్ల గాలి ముక్కు రంధ్రాల గోడలకు తగలడంతో అక్కడ నైట్రిక్‌ ఆక్సైడ్‌ అణువులు పుడతాయని, అవి గాలి ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి.. రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎక్కువగా కలిసి ప్రవహించేందుకు అవకాశం ఉంది అని అయన చెప్పారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: