రాజకీయాల్లో ఎప్పుడు ఎం జరుగుతుందో తెలీదు అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కార్మిక సంఘాల్లో గుబులు రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నిరసనలు వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.  ఈ పరిణామాన్ని టీఆర్ఎస్ అవకాశంగా మలుచుకోవాలని చూస్తోందని భోగట్టా. 

 


అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత  గత ఎన్నికల్లో ఎంపీ పదవికి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల అనంతరం కొన్నాళ్ళు కవిత పార్టీ వ్యవహారాల్లో అంతగా అక్టీవ్ గా కనిపించలేదు. అయితే రేపో మాపో ఆమె ఎమ్ఎల్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే  తెలంగాణలో తిరుగులేని అధికారం టీఆర్ఎస్‌కు ఉంది అయితే ఈ ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు కానీ కేంద్ర నిర్ణయాలపై వ్యతిరేకత చూపించే అవకాశం ఉంది.  మాజీ ఎంపీ కవిత ప్రస్తుతానికి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా బొగ్గు గనుల రాజకీయాల అనుభవం ఇప్పుడు ఆమెను నాయకత్వం వచించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.  కేంద్రం ఇటీవల బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్న ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ కూడా ఓ భాగం కాబట్టి ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. 

 


కేంద్ర నిర్ణయంపై సింగరేణిలో ఇప్పటికే కార్మికులు ఉద్యమాలు ప్రారంభించారు. టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్మాణ నిర్వహణలో కవిత పాత్ర కీలకం.ఇప్పుడు అదే హోదాలో ఆందోళనలకు సిద్దమయ్యారు. టిబిజికేఎస్ నాయకులతో సమావేశమై… ఉద్యమానికి నేతృత్వం వహించాలని కోరారు. దానికి కవిత అంగీకరించారు. ఒక పక్క వర్గ పోరు, అనిశ్చితి కారణంగా మళ్ళీ ఇప్పుడు కవిత ఎంట్రీ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అయితే హైదరాబాద్ సింగరేణి భవన్ వద్ద జరిగే కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలి హోదాలో కవిత పాల్గొననున్నారు. కవిత ఎంట్రీ తో తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: