ప్రస్తుత రోజుల్లో యువత డబ్బులు సులువుగా సంపాదించడానికి ఎంత దారుణానికి అయినా తెగబడుతున్నారు. అంతేకాక జల్సాలకు అలవాటుపడి... కష్టపడడం మానేసి ఇతరులను ఎలా మోసం చేయాలి... ఎలా మోసం చేస్తే సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారికి ఇంటర్నెట్ ఒక వేదికగా మారిపోయిందనే చెప్పాలి. ఇంటర్నెట్ వినియోగం మంచి పనికి ఉపయోగించడం పక్కనపెట్టి, ఆ సమాచారాన్ని వినియోగించకుండా కొంతమంది సొమ్ము చేసుకునే ఆలోచనలో ఉన్నారు. 

IHG

 

 

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్స్ ను ఉపయోగిస్తూనే ఉంటాం. ఇక మన వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ లో ఉంటాయి. ఇక వీటినే సైబర్ కేటుగాళ్లు వారి హతురాలుగా మార్చుకొని మన అకౌంట్లను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి సంఘటనే ఛత్తీస్గఢ్ లో చోటుచేసుకుంది. వాట్సాప్ నెంబర్ ను హ్యాక్ చేసి ఏకంగా 100 మంది అమ్మాయిలను హ్యాక్ చేయడం జరిగింది. ఇక సైబర్ కేటుగాళ్ళు యాడ్ చేయడమే కాకుండా ఆ అమ్మాయిలు అందర్నీ బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

 


ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.... హర్యానాకు చెందిన ముగ్గురు యువకులు అమ్మాయిల వాట్సాప్ సేకరించడంతో పాటు వాటిని హ్యాక్ చేసి వంద మందికి పైగా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇక వారందిరి దగ్గర నుంచి వ్యక్తిగత వివరాలను బయటపెడతామని బెదిరింపులకు పాల్పడిన వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సొమ్మును దోచుకుంటున్నారు. ఇటీవల వీరు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక పోలీస్ అధికారులు వీరు ముగ్గురితో కలిసి హ్యాకింగ్ చేసిన వంద మందికి పైగా అమ్మాయిల వివరాలను సేకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: