దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ విధించడం వలన చాల మంది వారి జీవనోపాధిని కోల్పోయారు. రోజు కూలీలు పరిస్థితి మరి దారుణంగా మారింది. తినడానికి తిండి లేక చాల ఇబ్బందులు పడుతున్నారు.

 

 

అయితే ఈ కష్టకాలం నుండి మీరు బయటపడాలని అనుకుంటున్నారా..? ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నారా? అయితే మీకు ఒక్క శుభవార్త. ఇంట్లో నుంచే సులభంగా రుణం పొందే అవకాశం ఒకటి అందుబాటులో ఉందన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదన్నారు. కేవలం ఒక్క యాప్‌తో సులభంగానే లోన్ తీసుకోవచ్చునన్నారు.

 

 

అయితే నవి అనే సంస్థ తాజాగా నవి లెండింగ్ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం విదితమే. దీని సాయంతో కస్టమర్లు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చునన్నారు. రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చునని తెలిపారు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు.

 

 

అయితే గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. లోన్ పొందాలని భావించే వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుందన్నారు. తర్వాత కస్టమర్లు వారి రుణ అర్హతలు తీసుకోవాలన్నారు. అర్హత ఉంటే క్షణాల్లోనే రుణం లభిస్తుందన్నారు. మీ బ్యాంక్ అకౌంట్‌కు నేరుగానే డబ్బులు వచ్చేస్తాయన్నారు.

 

 

పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటివి అవసరం అవుతాయని తెలిపారు. దీని కోసం ఎలాంటి డాక్యుమెంట్లు కూడా అప్‌లోడ్ చేయాల్సిన పని లేదన్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్, పే స్లిప్ వంటి వాటితో కూడా అవసరం ఉండదన్నారు. లోన్ ప్రాసెస్ అంతా సులభంగా పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ మార్గంలో జరిగిపోతుందన్నారు.

 

 

నవి లెండింగ్ యాప్ ద్వారా అర్హత కలిగిన కస్టమర్లు రుణాలను 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లోనే పొందొచ్చని కంపెనీ యాజమాన్యం తెలిపారు. కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునాతన టెక్నాలజీల ఆధారంగా పని చేస్తుందన్నారు. అందుకే త్వరితగతిన రుణాలు అందిస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: