మహిళలు బయటకు వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో వారికి పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉండవు. దీనివల్ల వారు అసౌకర్యానికి గురికావాల్సి వస్తుంది. కనుచూపు మేరలో ఆమెకు ఎక్కడా టాయిలెట్లు కనిపించలేదు. ఇంటికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. కాని చేసేదిలేక అలాగే ఉండిపోయింది. తనే ఇంత ఇబ్బంది పడుతుంటే.. ఇక అనారోగ్యంతో బాధపడేవారి పరిస్థితి మరి ఇబ్బందికరంగా ఉంటుంది. 

 

 

పురుషులతో పోటీగా మహిళలు కూడా ఉద్యోగాల్లో పోటీ పడుతున్నారు. అన్ని సంస్థల్లోనూ మహిళల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. కానీ మహిళలకే ప్రత్యేకమైన కొన్ని సమస్యలకు పరిష్కారం మాత్రం ఇంకా దొరకడం లేదు. అందులో ముఖ్యమైనది టాయిలెట్స్ లేకపోవడం. ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి మహిళా మరుగుదొడ్ల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. శుభ్రమైన టాయిలెట్లు ఎక్కడ ఉంటాయో తెలియక, ఇంటికి వచ్చే వరకు తమ సమస్యను అలా కడుపులోనే దాచుకుని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.

 

 

మనసు పెడితే పనికి రావని పడేసిన వస్తువులను కూడా మళ్లీ ఉపయోగపడేలా చేయొచ్చని నిరూపించారు కలెక్టర్ హరిచందన.. ఆమె చేసిన మంచి పనిని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. మహిళల కోసం బయోడైజెస్టర్ టాయిలెట్ ఏర్పాటులో కలెక్టర్ హరిచందన చొరవ ప్రశంసaనీయం. ఈ గొప్ప ఆలోచన మహిళలకు సౌకర్యంతో పాటు భద్రతనూ అందిస్తుంది అని మంత్రి పేర్కొన్నారు.

 

 

నారాయణపేట్ జిల్లా కలెక్టర్ హరి చందన తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వినియోగంలో లేని ఆర్టీసీ బస్సును మొబైల్ టాయిలెట్ ఏర్పాటుకు చొరవ చూపించారు. నారాయణపేట జిల్లా కోస్థి పురపాలికలో వీటిని ఏర్పాటు చేశారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు హరిచందన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: