గత కొన్ని రోజులుగా లద్ధాఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా భద్రతా దళాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. మన భూభాగంలోకి వచ్చారని భారత జవాన్లు వారిని నిరువరించారు. ఈ నేపథ్యంలో లద్ధాఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా భద్రతా దళాల మన సైనికులను దొంగ దెబ్బ తీసి అన్యాయంగా ఇరవై మంది జవాన్లను పొట్టనబెట్టుకుంది. తాజాగా మరో జవాను సచిన్ విక్రమ్ మోరే అనే మరో  కూడా వీరమరణం పొందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  దౌలత్ బేగ్ ఓల్డీ, డేవ్ సాంగ్ సెక్టార్లలో గొడవలు రేపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ, క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, వాహనాలను చేర్చి, సైనిక బలగాలను కూడా మోహరించింది.  2016లో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం పక్కనే కొత్తగా క్యాంపులు ఏర్పాటు చేసింది.

 

ఇక చైనా కదలికలను పరిశీలించిన భారత్, గత నెలాఖరులోనే డెప్ సాంగ్ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించింది. 2013లో ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించిన చైనా విఫలమైనది. అలాగే సరిహద్దుల్లో చెక్ పాయింట్ల సంఖ్యను, మిలటరీ కార్యకలాపాలను పెంచింది.  ఆనాటి నుంచి ఇరు వర్గాల మద్య ఎప్పటికప్పుడు యుద్దవాతావరణం నడుస్తుంది. తాజాగా  కొన్ని రోజుల క్రితం సిక్కింలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువ లెఫ్టినెంట్‌ బిరోల్ దాస్ సిక్కిం రాష్ట్రంలో భారత భూభాగంలో గస్తీ కాస్తున్నాడు. కానీ, కొందరు చైనా గస్తీ సైనికులు తరచూ భారత భూభాగంలోకి వస్తూ రెచ్చగొడుతున్నారు. 

 

అంతే భారత పౌరుషం అంటే ఏంటో చూపించాడు.  అనుకున్నదే తడవుగా భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా బెదిరిస్తున్న చైనా మేజర్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లి అతని మూతిపై చాచికొట్టాడు. ఆ దెబ్బకి చైనా మేజర్ ముక్కుపగిలి కింద పడిపోయాడు. దీంతో చైనా గస్తీదళం మెల్లగా వెనక్కి వెళ్ళింది. బిరోల్ దాస్ కుటుంబం మొత్తం దేశసేవలోనే ఉండటం విశేషం. ఆయన తాత, తండ్రి సైన్యంలో సేవలందించారు. ఆయన సోదరి కూడా సైన్యంలోనే పనిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: