మొన్న 15వేలు.. నిన్న 16 వేలు.. ఈ రోజు 17వేలు.. ఇవి రోజురోజుకు దేశంలో నమోదవుతున్న కేసులు. ఏ రోజుకు ఆ రోజు రికార్డులు తిరగరాస్తూ.. కరోనా విజృంభిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటేలా కనిపిస్తోంది. 

 

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. దేశంలో కొత్తగా మరో 16,922 పాజిటివ్‌ కేసులు, 418 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఒక్క రోజు కేసుల్లో ఇదే అత్యధికం. ఈ కేసులతో దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 4,73,105కి పెరిగింది. ఈ మహమ్మారి సోకిన వారిలో 2,71,697మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 14,894మంది చనిపోయారు.  భారత్‌లో ప్రస్తుతం 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

మరోవైపు, దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య క్రమంగా పెంచుతున్నారు. నిన్న ఒక్క రోజే రెండు లక్షలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 75,60,782 శాంపిల్స్‌ పరీక్షించారు.  దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారిలో కేవలం 4.16శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సపోర్ట్‌ అవసరమని అధికారులు తెలిపారు. దేశంలో అత్యధికంగా కేసులు మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌,  రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నమోదు కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి బారినపడి వారి సంఖ్య 10వేల మార్కును దాటేసింది.

 

దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోని ఇతర నగరాల కంటే.. ఒక్క రోజులో అత్యధికంగా క‌రోనా కొత్తకేసులు న‌మోద‌య్యాయి. జూన్ 23న ఢిల్లీలో 3,947 క‌రోనా కేసులు నమోదయ్యాయి. అదే రోజున.. న్యూయార్క్, మాస్కో, సావోపాలో , శాంటియాగో , లిమా న‌గ‌రాల కంటే అత్యధిక క‌రోనా కేసులు వచ్చాయి. వారం రోజులుగా ఢిల్లీలో క‌రోనా ప‌రీక్షలను పెంచారు. దీంతో  కేసుల సంఖ్య పెరిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఢిల్లీ 40 వేల కేసులు.. గత 2 వారాల్లోనే నమోదయ్యాయి. 

 

మరోవైపు, బెంగాల్‌లోనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సర్కార్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జులై 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఐఐటీ బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి వరకూ  ఆన్‌లైన్ లోనే బోధన కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వరంగ విద్యాసంస్థ.. ఐఐటీ బాంబేనే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: