మొన్నటి వరకు దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ పాటించిన విషయం తెలిసిందే. దాంతో నేరాల సంఖ్య భారీగానే తగ్గిపోయాయి.  కరోనా భయంతో ఎవరూ బయటకు రాకుండా ఇంటి పట్టున ఉంటూ రెండు నెలలు గడిపారు. దేశంలో కరోనాతో మరణాలు కూడా బాగానే పెరిగిపోయాయి.  వైరస్ తీవ్రత ప్రతిరోజూ పెరిగిపోతూనే ఉంది.. అయితే ఈ మద్య నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కారణం మొన్నటి వరకు లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని.. సడలింపు ఇచ్చారు.  దాంతో వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లారు.. ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ అత్యాచారాల కేసులు పెరిగిపోతున్నాయి. దుర్మార్గులు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు.

 

ఈ మద్య కాలంలో వరుసగా ఇలాంటి అత్యాచార కేసులు ఎన్నో నమోదు అవుతున్నాయి. తాజాగా  ఛ‌త్తీస్ గ‌ఢ్‌లోని బీమితార జిల్లాలోదారణం చోటు చేసుకుంది. తాము అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎదురు తిరిగింది. అత్యాచార ఘ‌ట‌న‌ను ప్ర‌తిఘ‌టించిన బాలిక‌పై ఇద్ద‌రు దుండ‌గులు పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్‌లోని బీమితార జిల్లాలో జూన్ 22న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.  14 ఏళ్ల బాలిక త‌న ఇంటికి 200 మీట‌ర్ల దూరంలోని పొలంలోకి వెళ్లింది.తాను చ‌దువుతున్న పాఠ‌శాల‌లోని ఇద్ద‌రు సీనియ‌ర్లు.. మైన‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు య‌త్నించారు.

 

దుండ‌గుల య‌త్నాన్ని బాలిక తీవ్రంగా ప్ర‌తిఘ‌టించింది.  అంతే పిచ్చిన పట్టిన వాళ్లలా ప్రవర్తించారు ఆ దుండగులు. ఆమెపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టి అక్క‌డ్నుంచి ఇద్ద‌రు ప‌రారీ అయ్యారు. వీరిద్ద‌రిలో ఒక‌రు మైన‌ర్ ఉన్నారు. అయితే బాలిక ఇంట్లో లేక‌పోయే స‌రికి స‌మీప ప్రాంతాల్లో ఆమె త‌ల్లిదండ్రులు వెతికారు. మొత్తానికి 80 శాతం కాలిన గాయాల‌తో ఉన్న బిడ్డ‌ను గుర్తించి.. చికిత్స నిమిత్తం రాయ్ పూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆ బాలిక చనిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: