కరోనా కల్లోలంలో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ మహమ్మారి వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇప్పుడంతా... కోవిడ్‌ 19కు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వైరస్‌పై జరుగుతున్న యుద్ధంలో... ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌  ఎంత పోరాడుతున్నా అసలు సిసలైన హీరో  మాత్రం వ్యాక్సినే. ఇప్పుడు దానిపైనే అందరి ఆశలు. 

 

ప్రపంచాన్ని ఇంతకు ముందు ఎన్నో ప్రాణాంతక వైరస్‌లు వణికించాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కోట్లమందిని బలిగొన్న మశూచి.. ఇప్పుడు జాడేలేదు. ఎంతోమంది జీవితాల్ని చీకటి మయం చేసిన పోలియో కూడా దాదాపు మాయమైపోయింది. అందుకు కారణం... వాటిని ఎదుర్కొనేందుకు..  సమర్థమైన వ్యాక్సిన్లు మార్కెట్‌లోకి రావడమే. ఆ వ్యాధుల నియంత్రణకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరాఖరుకు వ్యాక్సినే వాటి ఆటకట్టించింది.

 

ప్రస్తుతం అగ్రరాజ్యాల నుంచి చిన్నచిన్న దేశాల వరకు.. అంతటా విధ్వంసం సృష్టిస్తున్న కరోనాకు సైతం వ్యాక్సిన్‌తోనే అడ్డుకట్ట వేయగలం. అప్పటి వరకు స్వీయ నియంత్రణతో కూడిన జాగ్రత్తలు తీసుకోవడమే తప్ప మరో దారి లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే కరోనాపై పోరులో సిసలైన గేమ్‌ చేంజర్‌ ముమ్మూటికీ  వాక్సిన్ మాత్రమే. అంతకమించి మరో ప్రత్యామ్నాయం లేదు.. ఎవరెన్ని చెప్పినా... అది వాస్తవం కాదు. 

 

అయితే గత కొంతకాలంగా, వైరస్‌కు ఇదిగో మందు, అదిగో మందు అంటూ ప్రచారం జరగడమే తప్ప... స్పష్టంగా వ్యాక్సిన్‌ తయారైనట్టు ఎక్కడా దాఖలాలు లేవు.. ఆ పరిస్తితులు కనిపించడం లేదు. కరోనా కు వ్యాక్సిన్ తయారు చేయండం కూడా అంత ఈజీ ఏం కాదని.. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది అంటే  వైరస్ ఎంత ప్రమాదకారో... ఆ వైరస్ ను నియంత్రించగల వ్యాక్సిన్ కనుక్కోవడమూ ఎంత  కష్టసాధ్యమో అర్ధమవుతుంది . అప్పటి దాకా కరోనాతో సహజీవనం చేయడం తప్ప చేసేదేం లేదని  కూడా తేల్చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  దీంతో కరోనాను పూర్తిగా రూపు మాపడంపై కాకుండా.. నియంత్రించడంపై అన్నిదేశాలూ దృష్టి పెట్టాయి. అయితే, ఈ వైరస్‌ అంతానికి కావాల్సిన పవర్‌ఫుల్‌ వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

 

ఓవైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.. మరణాల సంఖ్య కూడా అదే రేషియోలో పరుగెడుతోంది .  దీంతో అన్ని దేశాలూ తీవ్ర ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అందుకే, దేనికదే కరోనా వ్యాక్సిన్‌ కోసం కళ్లప్పగించి చూస్తున్నాయి. వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయితే, ఎంత ప్రయత్నించినా పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశోధనా కేంద్రాలు సైతం.. ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో, కరోనా వ్యాక్సిన్‌ ఎప్పటికప్పుడు మోస్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారిపోతోంది. 

 

ఇదిగో కరోనా వ్యాక్సిన్‌.. అదిగో కరోనా వ్యాక్సిన్‌ .. అంటూ హడావిడి తప్ప ఇప్పటి వరకూ ఈ విషయంలో పురోగతి మాత్రం కనిపించలేదు. ఈ వైరస్‌కు మందు రావాలంటే.. ఇంకొంత కాలం ఆగక తప్పని పరిస్థితి. అంతమాత్రాన గతంలో కోట్ల ప్రాణాల్ని బలితీసుకున్న మహమ్మారుల కంటే.. కరోనా ఖతర్నాక్‌ అని  చెప్పలేం. అలాగని, వైరస్‌ వ్యాక్సిన్‌ను కనిపెట్టడంలో పరిశోధకుల శక్తిని తక్కువ అంచనా వేయలేం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: