దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కేసులు.. ఎవ్వరి నోట విన్నా కరోనా గురించిన చర్చలే నడుస్తున్నాయి.  కరోనా వైరస్ ని నిర్మూలించడానికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదు. అయితే కరోనా వైరస్ ని సంపూర్ణంగా నిర్మూలించడానికి దాదాపు 80 దేశాల వారు వ్యాక్సిన్ కోసం తెగ కష్టపడుతున్నట్లు సమాచారం. కాకపోతే మన భారత దేశంలో కరోనాని ఎదుర్కొనడానికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మన పురాతన సాంప్రదాయాలు పాటిస్తే చాలా బెటర్ అంటున్నారు. ఒకప్పుడు రుషులు చెప్పినట్లు ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ పవర్ పెంచే మార్గాలు ఉన్నాయని వాటిని ఇప్పుడు వీడియోలు, ఆర్టికల్స్ రూపంలో తీసుకువస్తున్నారు. ఇక కరోనాతో ఇప్పటి వరకు పోరాటం చేస్తున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు సైతం కరోనా భారిన పడుతున్నారు.  

 

ఈ క్రమంలో బెంగాల్ పోలీసులు, కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కొత్త ప‌ద్ద‌తుల‌ను క‌నుగొన్నారు.  ఆవ‌నూనె, నిమ్మకాయ క‌లిపిన వేడినీళ్లు తాగితే కరోనాను సమర్థవంతంగా జయించవచ్చని అంటున్నారు. ఆవనూనె, నిమ్మరసం కలిపిన మిశ్రమం తీసుకోవ‌డం వ‌ల్ల కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకుంటామ‌ని ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి పోలీస్ కమిషనరేట్ ప‌రిధిలోని ఉన్న‌తాధికారులు వెల్లడించారు. క‌మిష‌న‌రేట్‌లోని డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ బంధువు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌కు క‌రోనా సోకగా.. వాళ్లు ఈ మిశ్రమాన్ని సేవించి త్వ‌ర‌గా కోలుకున్నారని అన్నారు.

 

అంద‌రికి  అందుబాటులో ఇంట్లోనే దొరికే ఆవ‌నూనె, నిమ్మ‌ర‌సం కలిపిన నీళ్లు తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి మెరుగు అవుతుంద‌న‌డానికి ఇలాంటివి  ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ త్రిపురారీ ఆర్ధవ్ మాట్లాడుతూ.. ‘గ‌త‌వారం రోజుల క్రిత‌మే డార్జిలింగ్ జంక్షన్ సమీపంలో ఉన్న పోలీసుకు, ఆయ‌న భార్య‌కు క‌రోనా సోకింది. దీంతో వారు ఈ చిట్కాల‌నే  పాటించగా.. రెండు రోజుల్లోనే వారు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మేం డాక్ట‌ర్లు కాక‌పోయినా చిన్న‌ప్ప‌టి నుంచి మ‌న పెద్దవాళ్లు అనుస‌రించేవి చూస్తూ పెరిగాం. మ‌న మూలాల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌వొద్దని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: