వైసీపీ పార్టీ లో అసమ్మతి సెగలు ఉన్న కొద్ది బయటపడుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా పదవి లోకి వచ్చి ఏడాది అయిన తరుణంలో… పార్టీలో మెల్లమెల్లగా అధిష్టానం పై వ్యతిరేకత కలిగిన నాయకులు బయట పడుతున్నారు. ఈ విషయంలో ముందు నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మొదటి ప్లేస్ లో ఉన్నాడు. అనేక సార్లు బహిరంగంగా మీడియా ముందే పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో ఎంపీ రచ్చ షురూ చేశాడు. పూర్తి విషయంలోకి వెళ్తే చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు తీవ్రస్థాయిలో అధిష్టానం పై మండిపడ్డారు.

 

బల్లి దుర్గాప్రసాదరావు గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా రాణించారు. చంద్రబాబు కి అత్యంత సన్నిహితంగా ఉండేవారని అతి చిన్న వయసులోనే మళ్లీ దుర్గాప్రసాదరావు రాజకీయాల్లో గెలవడం జరిగింది అని మంచి ప్రత్యేకత రాజకీయాల్లో ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున పార్లమెంట్ కు పోటీ చేసి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత దుర్గాప్రసాద్ పార్టీ క్యాడర్ ని పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా తనని ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రోటోకాల్ ప్రకారం తనకు గౌరవం దక్కటం లేదని ఆరోపిస్తున్నారు. తిరుప‌తి స్మార్ట్ సిటీ ప‌నుల్లో భాగంగా స్థానిక వినాయక్‌సాగర్‌ ఆధునికీకరణకు ఇటీవ‌ల‌ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఆయ‌న పేరును బల్లి దుర్గాప్రసాద్ బ‌దులు బి. దుర్గాప్రసాద్‌గా రాశారు. శిలాఫలకంలో అందరి ఇంటి పేర్లు వివరంగా రాసి.. తన ఇంటి పేరును ఇలా రాయడంపై ఎంపీ ఆగ్రహించారు.

 

దీని వెనకాల కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అంతేకాకుండా తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న గరుడ వారధి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు షాకింగ్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో పార్టీకి జగన్ ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారాయి. దీంతో మొన్న నరసాపురం ఎంపీ తాజాగా తిరుపతి ఎంపీ ఈ విధంగా ఒక్కసారిగా పార్టీ హైకమాండ్ పై విమర్శలు చేస్తున్న తరుణంలో జగన్ ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఇంఛార్జి మంత్రి కి ఆదేశాలు పంపటం జరిగిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: