తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పవన్ క్రేజ్ సినిమాల వరకే పరిమితమైనది అని 2019 ఎన్నికలు రుజువు చేశాయి. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగిన జనసేన ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించి, ఇప్పుడు వైసీపీ మద్ధతుదారుడుగా కొనసాగుతున్నారు.

 

ఇక పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలై, మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. కొన్నిరోజులు బాగా సైలెంట్ అయిపోవడం, సడన్‌గా వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో పవన్ అదే పని చేశారు. ఇదే సమయంలో సీఎం జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఇంకా ఎక్కువగా ప్రజల మన్ననలని పొందుతున్నారు. దాదాపు 65 శాతంపైనే ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

మళ్ళీ నెక్స్ట్ కూడా జగనే సీఎం అనిపించేలా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా సరే పాపం...ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం, జగన్ ప్రభుత్వంపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. జగన్ అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఏదొరకంగా పోరాటాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రతి పథకంపై విమర్శలు చేస్తున్నారు. జనంలో జగన్‌పై నమ్మకం ఉన్నా సరే చంద్రబాబు మాత్రం తన పోరాటాలు ఆపడం లేదు.

 

కానీ పవన్ మాత్రం ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే మెదలకుండానే ఉంటున్నారు. సీఎం రేసులో ఉన్న పవన్...జగన్ పాలన దెబ్బకు సైడ్ అయిపోయినట్లే కనిపిస్తోంది.  ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప పవన్ బయట కనపడటం లేదు. పవన్‌కు సీఎం కుర్చీ వద్దు అనుకుంటా...అందుకే మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: